బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెట‌ర్‌.. భార‌త‌ జ‌ట్టులోకి స్వాగ‌తం!

Published on Sat, 06/06/2026 - 18:05

శ్రీలంక‌లో జ‌ర‌గ‌నున్న ట్రై సిరీస్ కోసం ఇప్ప‌టికే భార‌త‌-ఏ జ‌ట్టు ఆ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్‌కు చోటు ద‌క్క‌డం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జ‌ట్టులో సాయి సుద‌ర్శ‌న్‌, ప‌డిక్క‌ల్‌, రుతురాజ్, ఆయుష్ బ‌దోని వంటి ఐపీఎల్ స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. 

2021 అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ టోర్నీ ద్వారా షేక్ ర‌షీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో ప‌డ్డాడు. జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో షేక్ ర‌షీద్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత 2022 ఐసీసీ అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన ప‌డ్డాడు. అయితే లీగ్ ద‌శ ఆఖ‌రికి చేరుకున్న క్ర‌మంలో తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన ర‌షీద్ ఆక‌ట్టుకున్నాడు. 

ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీస్‌లో 108 బంతుల్లో 94 ప‌రుగులు సాధించాడు. ఆ త‌ర్వాత ఫైన‌ల్లోనూ కీల‌క హాఫ్ సెంచ‌రీతో మెరిసిన షేక్ ర‌షీద్ టీమిండియా టైటిల్ గెల‌వ‌డంలోనూ స‌హాయ‌ప‌డ్డాడు.

ఎవ‌రీ షేక్ ర‌షీద్‌?
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ ర‌షీద్ క్రికెట్ ప్ర‌యాణం అడ్డంకుల‌తో సాగింది. అత‌డి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ కొడుకు ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జ‌ట్టుకు ఎంపికైన షేక్ ర‌షీద్ త్వ‌ర‌లోనే జాతీయ జ‌ట్టుకు కూడా ఎంపిక‌వ్వాల‌ని కోరుకుందాం. 

అండ‌ర్‌-19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అత‌డికి గుర్తింపు తెచ్చిన‌ప్ప‌టికీ దేశవాలీ క్రికెట్‌లో రాణించాలంటే రంజీ మ్యాచ్‌లు ఆడ‌డం త‌ప్ప‌నిస‌రి. అందుకే 2022లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ ర‌షీద్ ఓర్పు, టెక్నిక్‌, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని అల‌వ‌రుచుకున్నాడు. 2025-26 రంజీ సీజ‌న్‌లో షేక్ ర‌షీద్ అద్భుతంగా రాణించాడు. 

ఈ సీజ‌న్‌లో షేక్‌ర ర‌షీద్ మూడు శ‌త‌కాల‌తో 627 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 27 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన షేక్ ర‌షీద్ 46 స‌గ‌టుతో 1831 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచ‌రీలు, తొమ్మిది హాఫ్ సెంచ‌రీలున్నాయి. లంక ప‌ర్య‌ట‌న‌లో ముందుగా శ్రీలంక‌, అఫ్గానిస్తాన్‌తో క‌లిసి ఇండియా-ఏ ట్రై వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత‌ రెండు అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌, ఎన్‌ జగదీశన్‌, అమన్‌ మోఖడే, షేక్‌ రషీద్‌, జీషన్‌ అన్సారీ

ఇండియా-ఏ టూర్‌ ఆఫ్‌ శ్రీలంక షెడ్యూల్‌
జూన్‌ 25- తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)
జులై 2- రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)

చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్క‌ని ప‌దార్థం.. ట్రోల్‌ సరికాదు!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)