Breaking News

ముంబై ఇండియన్స్‌ జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ ట్రిస్టన్‌ స్టబ్స్‌..?

Published on Fri, 05/06/2022 - 08:26

ముంబై ఇండియన్స్‌ పేసర్‌ టైమల్‌ మిల్స్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్‌లో మిగితా మ్యాచ్‌లకు మిల్స్‌ స్థానంలో సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ను భర్తీ చేయనుంది. ఈ సీజన్ కోసం రూ. 20 లక్షల మొత్తానికి  స్టబ్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ముంబై జట్టులో స్టబ్స్‌ చేరనున్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడతున్న ట్రిస్టన్‌ స్టబ్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ ట్రిస్టన్‌ స్టబ్స్‌
ట్రిస్టన్ స్టబ్స్ దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆటగాడు. 21 ఏళ్ల స్టబ్స్ ఇంకా ప్రోటీస్ తరపున అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయలేదు. 2020లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ట్రిస్టన్ స్టబ్స్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 8 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన స్టబ్స్ 456 పరుగులు సాధించాడు. అదే విధంగా 11 లిస్ట్‌-ఎ, 17 టీ20లు ఆడిన స్టబ్స్.. వరుసగా 275, 506 పరుగులు సాధించాడు. ఇటీవల ముగిసినసౌతాఫ్రికా డొమాస్టిక్‌ టీ20 లీగ్‌లో స్టబ్స్ అదరగొట్టాడు. వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టబ్స్ సీఎస్‌ఎ-2022లో 293 పరుగులు సాధించాడు. స్టబ్స్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటన కోసం దక్షిణాఫ్రికా-ఎ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.

చదవండి: IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్‌ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)