Breaking News

ఐపీఎల్‌ 2024 వేలంలో భారీ ధర పలికిన అనామక ఆటగాడు

Published on Tue, 12/19/2023 - 19:44

ఐపీఎల్‌ 2024 వేలంలో ఓ అనామక ఆటగాడు భారీ ధర పలికాడు. జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కుమార్‌ కుషాగ్రా కలలో కూడా ఊహించని ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏకంగా 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. కుషాగ్రాను దక్కించుకోవడం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ చిన్న సైజు యుద్దమే చేసింది. ఈ యువ హిట్టర్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తీవ్రంగా పోటీపడ్డాయి.

ఈ వేలంలో 20 లక్షల బేస్‌ ధర విభాగంలో పేరును నమోదు చేసుకున్న కుషాగ్రా.. సమీర్‌ రిజ్వి తర్వాత అత్యధిక ధర పలికిన అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కుషాగ్రాకు ముందు సమీర్‌ రిజ్వికి సీఎస్‌కే 8.4 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మరో ఆటగాడు కూడా భారీ ధర పలికాడు. శుభమ్‌ దూబే అనే ఆటగాడిని రాజస్థాన్‌ రాయల్స్‌ 5.8 కోట్లు కొనుగోలు చేసింది. ఇవాల్టి వేలంలో ఢిల్లీ పెట్టిన అత్యధిక పెట్టుబడి కుషాగ్రాపైనే కావడం విశేషం. 

కుషాగ్రా కెరీర్‌ విషయానికొస్తే.. చిన్నతనం నుంచి టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్‌ ధోనిని చూస్తూ పెరిగిన ఈ యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ధోనిలా ఎదగాలని కలలు కనే వాడట. ఈ విషయాన్ని కుషాగ్రా చాలా సందర్భాల్లో చెప్పాడు. 2021లో దేశవాలీ క్రికెట్‌లో అడుగుపెట్టిన కుషాగ్రా.. అంతకుముందు ఏడాది (2020) అండర్‌ 19 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. 

2021-2022 సీజన్‌లో రంజీ జట్టుకు ఎంపికైన కుషాగ్రా.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ డబుల్‌ సెంచరీ (288) బాది అందరి దృష్టి ఆకర్శించాడు. కుషాగ్రా తన స్వల్ప కెరీర్‌లో 3 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 2 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు, 2 టీ20లు ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కుషాగ్రా సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)