Breaking News

33 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ‌ అరంగేట్రం.. ఎవ‌రీ ఆశా శోభన?

Published on Mon, 05/06/2024 - 17:32

భారత జ‌ట్టు త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాల‌నుకున్న కేర‌ళ స్పిన్న‌ర్ ఆశా శోభ‌న కల ఎట్ట‌కేల‌కు నేర‌వేరింది. సోమవారం సిల్హెట్ వేదిక‌గా బంగ్లాదేశ్ మ‌హిళ‌ల‌ల‌తో జ‌రుగుతున్న‌ నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా త‌ర‌పున  అరంగేట్రం చేసింది.  

భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీద‌గా శోభ‌న టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా  ఆశా శోభ‌న 33 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ‌ అరంగేట్రం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఆశా గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

ఎవ‌రీ ఆశా శోభన?
ఆశా శోభన దేశీవాళీ క్రికెట్‌లో కేర‌ళ సీనియ‌ర్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆద‌ర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 13 ఏళ్ల వ‌య‌స్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. 

ఆ త‌ర్వాత కేర‌ళ జ‌ట్టు త‌ర‌పున అద్బుతంగా రాణించ‌డంతో భార‌త-ఏ జ‌ట్టులో ఆమెకు చోటు ద‌క్కింది. కానీ సీనియ‌ర్ జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కించుకలేక‌పోయింది. అయితే డ‌బ్ల్యూపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలంజెర్స్ బెంగ‌ళూరు ఆమెను సొంతం చేసుకుంది. 

తొలి సీజ‌న్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన ఆశా.. డ‌బ్ల్యూపీఎల్-2024 సీజ‌న్‌లో మాత్రం దుమ్ములేపింది.  10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకాన‌మితో 12 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటింది. ఈ క్ర‌మంలో భార‌త సెల‌క్ట‌ర్లు నుంచి ఆశాకు పిలుపు వ‌చ్చింది.
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)