Breaking News

అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శ‌ర్మ‌

Published on Sat, 01/10/2026 - 19:21

మహిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ నుంచి మ‌రో యువ సంచ‌ల‌నం క్రికెట్ ప్రపంచానికి ప‌రిచ‌య‌మైంది. డ‌బ్ల్యూపీఎల్‌-2026 సీజ‌న్‌లో శ‌నివారం యూపీ వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన అనుష్క శ‌ర్మ‌.. త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టింది.

బెత్ మూనీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల అనుష్క తన సంచలన బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే, డాటిన్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఔరా అన్పించింది. అస్సలు తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న ఒత్తడి కొంచెం కూడా ఆమెలో కన్పించలేదు. 

కెప్టెన్ యాష్లీ గార్డరన్‌తో కలిసి 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అనుష్క నెలకొల్పింది. గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారింది. అనుష్క 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనుష్క గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ అనుష్క శర్మ..?
ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అనుష్క దేశవాళీ క్రికెట్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది. ఆమెకు చిన్న‌త‌నం నుంచి క్రికెట్‌పై మ‌క్కువ ఎక్కువ‌. అనుష్క త‌న అన్నయ్య ఆయుష్ శర్మను చూసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆయుష్ కూడా  ప్రొఫెషనల్ క్రికెటర్ కావ‌డం గ‌మ‌నార్హం.

అత‌డు త‌న బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం త‌న సోద‌రితో బౌలింగ్ చేయించేవాడంట‌. అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. దేశవాళీ క్రికెట్‌లో ఆమె ఇప్పటివరకు 620 పరుగులతో పాటు 22 వికెట్లు పడగొట్టింది. అనుష్క‌ మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్లకు కూడా ప్రాతినిథ్యం వ‌హించింది. అనుష్క‌ సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ-2025లో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి స‌త్తాచాటింది.

వేలంలో రికార్డు ధ‌ర‌..
ఈ క్ర‌మంలోనే గ‌తేడాది నవంబ‌ర్‌లో జ‌రిగిన మెగా వేలంలో అనుష్క‌పై కాసుల వ‌ర్షం కురిసింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 45 ల‌క్ష‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. త‌ద్వారా ఈ ఏడాది సీజ‌న్ వేలంలో అత్యధిక ప‌లికిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా ఆమె నిలిచింది. ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌లు చేస్తే అనుష్క త్వ‌ర‌లోనే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి  వ‌చ్చే అవ‌కాశ‌ముంది.
చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)