Breaking News

అతడు క్రీజులో ఉన్నంతవరకూ మేము భయపడ్డాము: అజాజ్‌ పటేల్‌

Published on Tue, 11/05/2024 - 15:15

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా వైట్‌వాష్ అయిన‌ప్ప‌టికి స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ త‌న అద్బుత ఇన్నింగ్స్‌ల‌తో అంద‌ర‌ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో రిష‌బ్ విరోచిత పోరాటం క‌న‌బ‌రిచాడు.

బంతి గింగరాల తిరుగుతున్న చోట కివీస్ స్పిన్న‌ర్ల‌ను పంత్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లి, గిల్‌, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మైన చోట పంత్ బౌండ‌రీల వర్షం కురిపించాడు. ఓ ద‌శ‌లో భార‌త్‌ను గెలిపించేలా క‌న్పించిన పంత్‌.. ఓ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో పెవిలియ‌న్‌కు చేరాల్సి వ‌చ్చింది. 

దీంతో 25 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి చ‌విచూసింది. అయితే మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్న‌ప్ప‌టికి పంత్‌పై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తునే ఉంది. అత‌డి సాహసోపేత ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ ఆట‌గాళ్లు సైతం ఫిదా అయిపోయారు. పంత్ క్రీజులో ఉన్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఆట‌గాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాయంట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ముంబై టెస్టు హీరో అజాజ్ ప‌టేల్ చెప్పుకోచ్చాడు.

అజాజ్ ప‌టేల్ తాజాగా ఎన్డీటీవీకి ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించినప్పుడు న్యూజిలాండ్ జట్టు భయపడిందా అన్న ప్ర‌శ్న అజాజ్‌కు ఎదురైంది. అవును రిష‌బ్ క్రీజులో ఉన్న‌ప్పుడు మేముంతా చాలా భ‌య‌ప‌డ్డాము అని అజాజ్ ప‌టేల్ బ‌దులిచ్చాడు.

ఈ సిరీస్‌లో రిష‌బ్ పంత్‌ను ఎక్కువ‌గా టార్గెట్ చేశాం. అత‌డు క్రీజులో ఉన్న‌ప్పుడు ఏ బౌల‌ర్‌కు భ‌య‌ప‌డ‌డు. ఏది ఏమైనా తన ఆట ఆడుతుంటాడు. క్రీజులో ఉన్నంత‌సేపు ప‌రుగులు రాబ‌ట్టడానికే ప్ర‌య‌త్నిస్తాడు. అత‌డు త్వ‌ర‌గా ఔట్ అయితే ఏ స‌మ‌స్య లేద‌ని అజాజ్ ప‌టేల్ అదే ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు?
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)