Breaking News

రోహిత్‌, విరాట్‌ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ

Published on Sat, 06/01/2024 - 15:49

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అమెరికాలోని డలాస్‌ వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.  ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఐసీసీ టోర్నీ కోసం సన్నద్ధమైంది.

న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జూన్‌ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఈసారి కూడా భారీ అంచనాల నడుమ రోహిత్‌ సేన ప్రపంచకప్‌ బరిలో దిగనుంది. టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు, టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌కప్‌ అన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇరువురిపై ఒత్తిడి ఉండటం సహజం.

అదే విధంగా బ్యాటింగ్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంచనాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆటగాళ్లు అంత ఎక్కువగా ఒత్తిడికి లోనై.. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేరని పేర్కొన్నాడు.

‘‘రాహుల్‌ ద్రవిడ్‌ చాంపియన్‌ క్రికెటర్‌. ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నడంలో దిట్ట. అయితే, రిలాక్స్‌ కావడానికి తనకూ కొంత సమయం కావాలి.

రోహిత్‌ భార్య(రితికా సజ్దే)ను స్టాండ్స్‌లో చూసినపుడు మనకే అర్థమవుతుంది. ఆమె ఎంత ఒత్తిడిలో ఉన్నారో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అదే విధంగా.. విరాట్‌ భార్య(అనుష్క శర్మ)ను చూసినపుడు కూడా ఇదే అనిపిస్తుంది.

ఆమె ఎంత ప్రెజర్‌ ఫీల్‌ అవుతున్నారో తెలిసిపోతుంది. ఆటగాళ్లపై ఆశలు పెట్టుకున్నామంటూ వాళ్లను ఎంత ఒత్తిడికి లోను చేస్తోంది మనమే. తప్పు మనవైపే ఉంది. 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ ఇదే జరిగింది.

మేజర్‌ టోర్నీల్లో ఫైనల్‌ వంటి కీలక మ్యాచ్‌లు ఆడుతున్నపుడు ఒత్తిడి పెట్టకుండా స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించగలగాలి’’ అని గంగూలీ రెవ్‌స్ట్పోర్స్‌తో వ్యాఖ్యానించాడు. అంచనాల పేరిట ఆటగాళ్లపై మానసికంగా భారం మోపడం సరికాదని దాదా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.

ఇక వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లోనూ టీమిండియా ఓడిపోవడానికి ఇదే కారణమని.. ఆటగాళ్లు కూడా కాస్త రిలాక్స్‌గా ఉండి ఒత్తిడి పడకుండా చూసుకోవాలని సౌరవ్‌ గంగూలీ చెప్పుకొచ్చాడు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు