Breaking News

సచిన్‌కు కాబోయే కోడ‌లు సానియా ఆస్తి ఎంతో తెలుసా?

Published on Thu, 08/14/2025 - 15:31

భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్ త్వ‌ర‌లోనే పెళ్లి పీటలెక్క‌నున్నాడు. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయిన‌ప్ప‌టికి అర్జున్ ఎంగేజెమెంట్ వార్త  బ‌య‌ట‌కు రావ‌డంతో సానియా బ్యాగ్రౌండ్ గురుంచి నెటిజ‌న్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవ‌రీ సానియా?
ముంబైకి చెందిన సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పొందింది. ఆమెకు పెంపుడు జంతువులంటే ఇష్టం. దీంతో సానియా 2022లో ముంబైలో మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్‌ స్టోర్ ఎల్ఎల్‌పీ లగ్జరీ పెట్ స్పాను స్థాపించింది.

ఈ కేంద్రాల్లో గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీలతో పెంపుడు జంతువులకు ప‌త్యేక ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ.87 కోట్లు ఉన్న‌ట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపోర్ట్‌లు తెలియ‌జేస్తున్నాయి. ఇక సానియా తాత ర‌వి ఘాయ్ ముంబైలో అత్యంతంత ధ‌న‌వంతుల్లో ఒక‌రు.

ఆయ‌న గ్రావిస్ గ్రూప్ యజమాని. ఈ గ్రూప్ బాస్కిన్-రాబిన్స్ ఇండియా, బ్రూక్లిన్ క్రీమరీ ఐస్‌ క్రీమ్‌ లాంటి బ్రాండ్‌లను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కార్య‌కాలాపాల్లో సానియా యాక్టివ్‌గా పాల్గోంటున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముంబైలోని ఇంటర్‌ కాంటి నెంటల్ హోటల్ కూడా ఈ కుటుంబానికి చెందిందే. 

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో  రూ. 624 కోట్ల టర్నోవర్ సాధించింది. అంత‌కముందు ఆర్ధిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ఇది 20% ఎక్కువ. ఆహారం, హాస్పటాలిటీ రంగాల్లో ఎక్కువగా వీరి వ్యాపారం కొనసాగుతోంది. అయితే సానియా తండ్రి గౌరవ్ ఘాయ్‌కి, త‌న తాత‌ రవి ఘాయ్‌తో కొన్ని కుటుంబ వివాదాలు ఉన్న‌ట్లు సమాచారం.
చదవండి: జపాన్‌లో టీమిండియా కెప్టెన్‌.. ఆకస్మిక పర్యటనపై అనుమానాలు..?

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)