Breaking News

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే?

Published on Fri, 06/02/2023 - 16:10

జూన్‌ 7 నుంచి లండన్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి భారత జట్టు సిద్దమైంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్ సేన.. వరుస ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది.

పటిష్ట ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కూడా తమ సన్నహాకాలను ప్రారంభించింది. ఇక  డబ్ల్యూటీసీ ఫైనల్‌ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
డబ్ల్యూటీసీ ఫైనల్‌ లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి 11 వరకు జరగనుంది.

ఇండియాలో ఈ మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 
ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ స్టార్ స్పోర్ట్స్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే?
డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరిగే ఐదో రోజుల్లో వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఆ రోజు ఆటను  రిజర్వ్‌ డే రోజు కొనసాగిస్తారు. జూన్‌12ను రిజర్వ్‌ డేగా ఐసీసీ నిర్ణయించింది.

డ్రాగా ముగిస్తే విజేత ఎవరంటే?
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే భారత్‌-ఆస్ట్రేలియా జట్లను  సంయుక్త విజేత‌లుగా ఐసీసీ ప్రకటిస్తుంది. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తారు.

ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?
డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 13.22 కోట్లు ప్రైజ్‌మ‌నీని అంద‌జేస్తున్నారు. ర‌న్నరప్‌కు 6.61 కోట్లు ద‌క్కనుంది.


చదవండి: Womens Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)