Breaking News

వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్‌ విజేత ఎవరంటే?

Published on Tue, 06/03/2025 - 08:27

ఐపీఎల్‌-2025 తుది స‌మ‌రానికి స‌మ‌యం అస‌న్న‌మైంది. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోవ‌డానికి సిద్ద‌మయ్యాయి. ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతోన్నాయి.

ఇరు జ‌ట్లు స‌మవుజ్జీల‌గా ఉండ‌డంతో విజేత ఎవ‌రన్న‌ది క్రికెట్ నిపుణులు అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఈ ఆఖ‌రి పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా క్వాలిఫయర్‌-2 లానే ఫైనల్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన సెకెండ్ క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది.

ఇప్పుడు ఆక్యూవెధర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం కూడా ఆహ్మదాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వర్షం వల్ల కానీ మరీ ఏ ఇతర కారణాల చేత ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని అభిమానుల తెగ చర్చించుకుంటున్నారు.

మ్యాచ్ రద్దయితే..?
ఫైన‌ల్‌కు వ‌ర్షం ఆటంకం క‌లిగిస్తే.. మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. అయితే ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రం బీసీసీఐ రిజర్వ్‌ డే కేటాయించింది. మంగ‌ళ‌వారం(జూన్ 3) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్‌ మొదులు కాకపోతే రిజర్వ్‌ డే అయిన  బుధ‌వారం మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్క‌డైతే మ్యాచ్ ఆగిందో అక్క‌డి నుంచే ఆటను కొన‌సాగిస్తారు.

ఒక‌వేళ బుధ‌వారం(జూన్ 4) కూడా మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు అవ‌కాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా ఐపీఎల్‌-2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే  తేలింది.
చదవండి: మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు...
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)