క్రికెట్ ప్లేయ‌ర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?

Published on Sat, 07/19/2025 - 18:09

టెస్టు మ్యాచ్‌లో ప్ర‌తీ రోజు ఆట‌లో లంచ్ విరామంతో పాటు టీ బ్రేక్ ఉంటాయి. అయితే లంచ్‌ బ్రేక్‌లో ఆట‌గాళ్లు ఏమి తింటారా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిచూపుతుంటారు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ ఓలీ పోప్ లంచ్ బ్రేక్‌లో తాను ఏమి తీసుకుంటాడో వెల్లడించాడు.

"సాధార‌ణంగా లంచ్ మెనూలో చికెన్, చేపలు, పాస్తాతో ప‌లు ర‌కాల వంట‌కాలు ఉంటాయి. ఆట‌గాళ్లు త‌మ‌కు ఎక్కువ‌గా ఎనర్జీ ఇచ్చే ఆహారాన్ని తీస‌కుంటారు. నా విష‌యానికొస్తే.. నేను బ్యాటింగ్‌లో ఉంటే ఎక్కువ‌గా ఫుడ్ తీసుకోను. ఆ స‌మ‌యంలో ఎందుకో నాకు ఎక్కువ‌గా తినాలనిపించ‌దు.

కాబట్టి నేను ప్రోటీన్ షేక్‌, అరటిపళ్లు ఎక్క‌వగా తింటాను. అదే రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే క‌నీసం ఆరటిప‌ళ్లు కూడా తిన‌ను. ఎందుకంటే ఎక్కువ తిని బ్యాటింగ్ కొన‌సాగించ‌డం చాలా క‌ష్టం. ఆ రోజు ఆట ముగిశాక ఫుడ్ తీసుకుంటాను. అదేవిధంగా సెకెండ్ బ్రేక్ స‌మ‌యంలో కొంత‌మంది ఆట‌గాళ్లు టీ  తీసుకోవడానికి ఇష్టపడతారు.

నేను అయితే నేను సాధారణంగా కాఫీ తాగుతాను. కొన్నిసార్లు, వర్షం ఆలస్యం అయినప్పుడు ఒక కప్పు టీ తాగుతాను అని" స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పోప్ పేర్కొన్నాడు. కాగా కాగా లార్డ్స్‌లో లంచ్‌ మెనూకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అందులో బటర్నట్ స్క్వాష్ సూప్,సీబాస్ ఫిల్లెట్, బాస్మతి రైస్‌, రొయ్యల కర్రీ వంటి వంటకాలు ఉన్నాయి. 

ఇక భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ పర్వాలేదన్పిస్తున్నాడు. తొలి టెస్టులో పోప్ అద్బుతమైన సెంచరీతో చెలరేగి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా లార్డ్స్‌ టెస్టులో కూడా 44 పరుగులతో రాణించాడు.

చదవండి: T20 Blast: చ‌రిత్ర సృష్టించిన 17 ఏళ్ల కుర్రాడు.. హ్యాట్రిక్ వికెట్ల‌తో రికార్డు! వీడియో

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)