Breaking News

విండీస్, ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు

Published on Sat, 05/24/2025 - 02:21

డబ్లిన్‌: ఐర్లాండ్‌ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న వెస్టిండీస్‌ రెండో వన్డేలో అదరగొట్టింది. భారీ స్కోరు చేసి విజయంపై ఆశలు పెంచుకున్న వెస్టిండీస్‌ను వరుణదేవుడు కరుణించలేదు. ఫలితంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక భారీ వర్షం రావడంతో ఐర్లాండ్‌ ఛేజింగ్‌ సాధ్యపడలేదు. వెరసి మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్‌ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ కెప్టెన్  పాల్‌ స్టిర్లింగ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేసీ కార్టీ (109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేయగా... చివర్లో మాథ్యూ ఫోర్డీ (19 బంతుల్లో 58; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) శివమెత్తాడు. కేవలం 16 బంతుల్లోనే ఫోర్డీ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఏబీ డివిలియర్స్‌ (16 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును ఫోర్డీ సమం చేశాడు. 

కెప్టెన్   షై హోప్‌ (57 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకోగా... జస్టిన్‌ గ్రీవెస్‌ (36 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో బ్యారీ మెకార్తీ, జోష్‌ లిటిల్‌ రెండు వికెట్ల చొప్పున తీయగా... లియామ్‌ మెకార్తీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)