Breaking News

టీమిండియాపై గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయింది.. ఇప్పుడు అస్సలు కాదు..!

Published on Tue, 07/11/2023 - 21:17

ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్‌.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి రెండు దశాబ్దాలు దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. విండీస్‌ జట్టు చివరిసారిగా 2002లో జమైకాలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియాపై గెలుపొందింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై గెలుపే లేదు. 

విండీస్‌తో రేపటి నుంచి (జులై 12) తొలి టెస్ట్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా  విండీస్‌.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? అసంభవమనే చెప్పాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరం చూశాం.  

అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం భారత్‌పై విండీస్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్‌ల్లో.. విండీస్‌ 30 గెలిస్తే, భారత్‌ 22 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

జట్ల వివరాలు..

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, శ్రీకర్‌ భరత్, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్‌ కుమార్‌.

వెస్టిండీస్: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (వైస్‌ కెప్టెన్‌), అలిక్‌ అథనేజ్‌, త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్‌, రఖీమ్‌ కార్న్‌వాల్‌, జోష్వా ద సిల్వా, షనోన్‌ గాబ్రియల్‌, జేసన్‌ హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కిర్క్‌ మెకంజీ, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌, జోమెల్‌ వారికన్‌ 

రిజర్వ్‌ ఆటగాళ్లు: టెవిన్‌ ఇమ్లాచ్‌, అకీమ్‌ జోర్డాన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)