Breaking News

‘గ్రేట్‌’ సోబర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది

Published on Sat, 07/18/2026 - 03:58

అద్భుత బ్యాటర్‌... అసాధారణ బౌలర్‌... అత్యుత్తమ ఫీల్డర్‌... క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ అనే మాటకు అసలైన పర్యాయపదం... ఆల్‌టైమ్‌ గ్రేట్, దిగ్గజ క్రికెటర్‌లాంటి విశేషణాలకు సరైన చిరునామా...సర్‌ గార్‌ఫీల్డ్‌ (గ్యారీ) సోబర్స్‌ తన ఇన్నింగ్స్‌ను ముగిస్తూ నిష్క్రమించారు. 90 ఏళ్ల వయసులో తన స్వస్థలం బార్బడోస్‌లో ఆయన కన్నుమూశారు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మొదటిసారి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఘనతలు ఈతరం క్రికెట్‌ అభిమానులకు సోబర్స్‌ను గుర్తు చేస్తుండగా...అంతకుమించిన సాధించిన ఎన్నో ఘనతలు ఆయన సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్‌ ఆడి 52 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ఇప్పటి క్రికెటర్లలో స్ఫూర్తి పాఠాలు నింపుతూ వచ్చిన సోబర్స్‌ ముద్ర శాశ్వతం.  

బార్బడోస్‌: మార్చి 1, 1958... క్రీజ్‌లో 10 గంటల 8 నిమిషాలు... 38 ఫోర్లు... వెస్టిండీస్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు చరిత్రను తిరగరాశాడు. 20 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అత్యధిక పరుగుల వ్యక్తిగత రికార్డును అతను అధిగమించాడు. అప్పటి వరకు ఆడిన 16 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన సోబర్స్‌ తన 17వ టెస్టులో ఏకంగా 365 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. తన తొలి సెంచరీనే అతను ప్రపంచ రికార్డుగా మలచుకున్నాడు. తొలి సెంచరీ సాధించిన బ్యాటర్లలో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు. 

లెన్‌ హటన్‌ (ఇంగ్లండ్‌) పేరిట ఉన్న 364 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును అధిగమించిన క్షణాన కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌ మైదానంలో 20 వేల మంది ప్రేక్షకులు దూసుకొచ్చి ఆ కుర్రాడిపై తమ అభిమానాన్ని ప్రదర్శించారు. అప్పుడు మొదలైన ఆ దిగ్గజ ఆటగాడి అసలు ప్రస్థానం మరో 16 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది. వెస్టిండీస్‌ జట్టు తరఫునే కాకుండా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌ కౌంటీ, ఆస్ట్రేలియా షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో సౌత్‌ ఆ్రస్టేలియా టీమ్‌ తరఫున సోబర్స్‌ తన ఘనమైన ఆటను ప్రదర్శించాడు.  

        2003 వన్డే వరల్డ్‌ కప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డును సచిన్‌కు అందజేస్తున్న సోబర్స్‌ (ఫైల్‌) 

                    2023లో వెస్టిండీస్‌లో భారత పర్యటన సందర్భంగా కోహ్లితో సోబర్స్‌ దంపతులు 

మేటి గణాంకాలు... 
కుర్రాడిగా ఉన్నప్పుడే ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటలపై ఆసక్తి కనబర్చిన సోబర్స్‌ ఆ తర్వాత పూర్తి స్థాయిలో క్రికెట్‌వైపు మళ్లాడు. తొలి టెస్టులో లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌గా 4 వికెట్ల ప్రదర్శనతో అతని కెరీర్‌ మొదలైంది. కొంత కాలం బౌలర్‌గానే అతను జట్టులో కొనసాగాడు. పేస్‌ మాత్రమే కాదు సాంప్రదాయ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా, లెఫ్టార్మ్‌ మణికట్టు స్పిన్నర్‌గా కూడా అతను ఎంతో ప్రభావం చూపించాడు. ఇలాంటి వైవిధ్యభరిత నైపుణ్యమే అతడికి ‘ఫైవ్‌ ఇన్‌ వన్‌ ఆల్‌రౌండర్‌’గా గుర్తింపు తెచ్చింది. పాకిస్తాన్‌పై 365 పరుగుల ఇన్నింగ్స్‌ తర్వాత బ్యాటర్‌గా సోబర్స్‌ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. 

అత్యంత పిన్న వయసులో ‘ట్రిపుల్‌ సెంచరీ’ చేసిన ఈ రికార్డు (21 ఏళ్ల 213 రోజులు) ఇప్పటికీ ఎవరూ అధిగమించలేకపోవడం విశేషం.  తర్వాతి ఐదు టెస్టుల్లో ఐదు శతకాలు బాదడంతో సోబర్స్‌ స్థాయి ఏమిటో అందరికీ తెలిసింది. టెస్టు ఘనతలు మాత్రమే కాకుండా 1971లో రెస్టాఫ్‌ వరల్డ్‌ తరఫున ఆ్రస్టేలియాపై మెల్‌బోర్న్‌లో చేసిన 254 పరుగుల ఇన్నింగ్స్‌ అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. ‘ఆసీస్‌ గడ్డపై నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌’ ఇదే అంటూ బ్రాడ్‌మన్‌తో సోబర్స్‌ ప్రశంసలందుకున్నాడు.  

ఒకే ఓవర్లో 6 సిక్సర్లు... 
‘ఆరు’ అంకెతో సోబర్స్‌కు పుట్టినప్పుడే అనుబంధం ఏర్పడింది!  తన రెండు చేతులకు అతను ఆరో వేలితో పుట్టగా... ఆ తర్వాత వాటిని తొలగించారు. అయితే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతను తొలిసారి నమోదు చేసిన ఫీట్‌ ఎప్పటికీ మర్చిపోలేనిది. కౌంటీ క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌ తరఫున ఆడుతూ ప్రత్యర్థి జట్టు గ్లామోర్గాన్‌ బౌలర్‌ మాల్కం నాష్‌ ఓవర్లో చెలరేగిన సోబర్స్‌ ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చరిత్ర సృష్టించాడు. తొలి నాలుగు బంతులను అతను లాంగాన్, స్క్వేర్‌లెగ్‌ల మీదుగా నాలుగు సిక్సర్లుగా మలిచాడు. ఐదో బంతిని ఫీల్డర్‌ రోజర్‌ డేవిస్‌ క్యాచ్‌ పట్టినా... అతని కాలు బౌండరీకి తగలడంతో అదీ సిక్స్‌గా మారింది. చివరి బంతిని కూడా వదలకుండా మిడ్‌వికెట్‌గా సిక్స్‌ కొట్టడంతో 6x6 పూర్తయింది.  

ఐసీసీ గౌరవం... 
క్రికెట్‌కు చేసిన సేవలకుగాను 1975లో బ్రిటన్‌ ప్రభుత్వం సోబర్స్‌ను నైట్‌హుడ్‌ (సర్‌) పురస్కారంతో సత్కరించింది. ఆ్రస్టేలియా ప్రభుత్వ ‘ఆఫీసర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఆ్రస్టేలియా’ కూడా అతనికి లభించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అతని ఘనతలను గుర్తిస్తూ క్రికెట్‌లో అత్యున్నత అవార్డు ‘సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ’ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా వార్షిక అవార్డుల్లో అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ‘బెస్ట్‌ ప్లేయర్‌’కు ఇదే అవార్డును అందజేస్తున్నారు.

ఒకే ఒక వన్డేలో డకౌట్‌ 
తన చివరి ఇన్నింగ్స్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌  డకౌట్‌గా వెనుదిరగడం క్రికెట్‌ చరిత్రలో ఎవరూ మరచిపోలేని ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయింది. సోబర్స్‌ కెరీర్‌లో కూడా అలాంటి క్షణం ఒకటి వచ్చింది. సుదీర్ఘ కెరీర్‌లో 95 దేశవాళీ వన్డేలు (లిస్ట్‌–ఎ) ఆడినా వెస్టిండీస్‌ తరఫున అతను ఒకే ఒక అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఇంగ్లండ్‌తో 1973లో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 బంతులాడిన సోబర్స్‌ పరుగు తీయకుండానే నిష్క్రమించాడు. విండీస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి వన్డే. క్లయివ్‌ లాయిడ్, కాళీచరణ్‌ సహా 11 మంది ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌ తర్వాత సోబర్స్‌ వన్డేలకు దూరం కాగా...ఇతర దిగ్గజాలు ముందుకు వెళ్లి రెండు ప్రపంచ కప్‌లను గెలిపించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)