Breaking News

ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్‌.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Published on Sun, 12/10/2023 - 13:34

బార్బడోస్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను  2-1తో విండీస్‌ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్‌ దీవుల్లో ఇంగ్లీష్‌ జట్టుపై విండీస్‌ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్‌ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ విజయం సాధించింది.

తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణ​కు వెస్టిండీస్‌ తెరదించింది. ఇ​క మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ డకెట్‌(71) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్‌య తలా  3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్‌ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్‌ టార్గెట్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కరేబియన్‌ బ్యాటర్లలో ఆథనాజ్‌(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌ 3 వికెట్లు.. అటిక్కినిసన్‌ 2, ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు. సిరీస్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్‌ కెప్టెన్‌ షాయ్‌ హోప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)