విండీస్‌ విజయం; చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం

Published on Wed, 07/05/2023 - 20:57

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో భాగంగా వెస్టిండీస్‌ జట్టు సూపర్‌ సిక్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరల్డ్‌కప్‌ అర్హత అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్‌కు ఈ విజయం ఊరట మాత్రమే. బుధవారం సూపర్‌ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్‌, ఒమన్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సూరజ్‌ కుమార్‌ 53 పరుగులు నాటౌట్‌, షోయబ్‌ ఖాన్‌ 50 పరుగులతో రాణించగా.. అయాన్‌ ఖాన్‌ 30, కశ్యప్‌ 31 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ మూడు వికెట్లు తీయగా.. కైల్‌ మేయర్స్‌ రెండు, కెవిన్‌ సింక్లెయిర్‌ ఒక వికెట్‌ తీశాడు.

అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. బ్రాండన్‌ కింగ్‌ (104 బంతుల్లో 100 పరుగులు) శతకంతో మెరవగా.. కెప్టెన్‌ షెయ్‌ హోప్‌ 63 నాటౌట్‌, పూరన్‌ 19 పరుగులు నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)