Breaking News

పోరాడుతున్న వెస్టిండీస్‌

Published on Sun, 12/21/2025 - 03:02

మౌంట్‌ మాంగనీ (న్యూజిలాండ్‌): టాపార్డర్‌ రాణించడంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో వెస్టిండీస్‌ పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్‌ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్‌ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా... ఓవర్‌నైట్‌ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్టిండీస్‌... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. 

కవెమ్‌ హడ్జ్‌ (254 బంతుల్లో 109 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్‌ కింగ్‌ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేయగా... జాన్‌ క్యాంప్‌బెల్‌ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్‌ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్‌ గ్రేవ్స్‌ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్‌బెల్‌ అవుట్‌ కాగా... కాసేపటికే బ్రాండన్‌ కింగ్‌ వెనుదిరిగాడు. వికెట్‌ కీపర్‌ టెవిన్‌ ఇమ్లాచ్‌ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) సాయంతో హడ్జ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 

ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్‌ అవుట్‌ కాగా... అలిక్‌ అథనజె, జస్టిన్‌ గ్రేవ్స్‌ సాయంతో హడ్జ్‌ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్‌ జట్టు ఫాలోఆన్‌ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్‌ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్‌ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 

సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. కెపె్టన్‌ రోస్టన్‌ చేజ్‌ (2) విఫలం కాగా... హడ్జ్‌తో పాటు అండర్సన్‌ ఫిలిప్‌ (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్‌ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్‌ బ్యాటర్‌ షై హోప్‌... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, ఎజాజ్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విండీస్‌ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)