Breaking News

వెస్టిండీస్‌ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు..

Published on Thu, 02/16/2023 - 09:40

వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టు పరిమిత ఓవర్ల కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్‌ ఆటగాడు షాయ్ హోప్ ఎంపికవ్వగా.. టీ20లకు విధ్వంసకర ఆల్‌రౌండర్‌ రోవ్‌మన్ పావెల్‌ నియమితుడయ్యాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ నికోలస్ పూరన్ విండీస్‌ వైట్‌ బాల్‌ కెప్టెన్సీకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

అతడి స్థానంలో వీరిద్దరూ బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 16 నుంచి దక్షిణాఫ్రికాతో జరగున్న వన్డే, టీ20 సిరీస్‌లతో సారథిలగా వీళ్ల ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా 2019 నుంచి విండీస్‌ వన్డే జట్టుకు హోప్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 48.08 సగటుతో 4308 పరుగులు చేశాడు.

అదే విధంగా రోవ్‌మన్ పావెల్‌ కూడా విండీస్‌ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గత ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న  జమైకా తల్లావాస్‌కు పావెల్‌ సారథిగా వ్యవహరించాడు.

అదే విధంగా అతడు కెప్టెన్‌గా జమైకా స్కార్పియన్స్‌కు యునైటెడ్ సూపర్50 కప్ టైటిల్‌ను కూడా అందించాడు. ఇక​ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా విండీస్‌ రెండు టెస్టులు,మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లో అతిథ్య జట్టుతో తలపడనుంది.
చదవండి: T20 WC: టీ20 ప్రపంచకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కలకలం.. బంగ్లా క్రికెటర్‌తో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)