Breaking News

మేము నిజంగా అదృష్టవంతులం.. అలా జరిగింటేనా: సూర్యకుమార్‌

Published on Sun, 07/28/2024 - 07:41

శ్రీలంక‌తో మూడు టీ20ల సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. ప‌ల్లెకెలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టీ20లో 43 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 214 ప‌రుగుల భారీ ల‌క్ష్యం సాధించ‌డంలో లంక విఫ‌ల‌మైంది. 19.2 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగుల‌కు శ్రీలంక ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో రియాన్ ప‌రాగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లా రెండు వికెట్లు సాధించారు. 

లంక బ్యాట‌ర్ల‌లో నిస్సాంక‌(79) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్‌(58) హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్ట‌గా.. పంత్‌(49), జైశ్వాల్‌(40) ప‌రుగుల‌తో రాణించారు. లంక పేస‌ర్ మ‌తీషా ప‌తిరానా 4 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన భార‌త బ్యాట‌ర్ల‌పై సూర్య ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. తొలి బంతి నుంచే  మా దూకుడైన స్టైల్‍లో బ్యాటింగ్ చేశాము. ఓపెన‌ర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వారు కూడా ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడారు. మేము ఇదే పిచ్‌పై దాదాపు మూడు రోజుల ప్రాక్టీస్ చేశాము. ఇక్క‌డ వికెట్ ఇలా ఉంటుందో మాకు బాగా తెలుసు. 

ముఖ్యంగా రాత్రి పూట మంచు ఎక్కువ‌గా ఉండి బ్యాటింగ్‌కు ఈజీగా ఉంటుంది. కానీ ఆదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు. అది మాకు బాగా కలిసొచ్చింది.వరల్డ్‌కప్‌లో కనబరిచిన ఆటతీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేదా అన్నది జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఆడాల్సిన క్రికెట్ ఇంకా చాలా ఉంది. కాబట్టి జట్టు అవసరం తగ్గటు ఏ నిర్ణమైనా తీసుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)