'అదే మా కొంపముంచింది.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి'

Published on Tue, 04/04/2023 - 14:56

చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది.  ఇక మ్యాచ్‌ అనంతరం తమ జట్టు ఓటమిపై లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహల్‌ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిందని, కానీ తమకు లభించిన ఆరంభాన్ని కొనసాగించలేకపోయాం అని రాహల్‌ తెలిపాడు.

రాహుల్‌ మాట్లాడుతూ.. "మేము ఈ మ్యాచ్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేశాము. కానీ మేము మాకు లభించిన ఘనమైన ఆరంభాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాం. మా జట్టులో నలుగురు ఐదుగురు బ్యాటర్లు బౌండరీ లైన్‌ వద్ద దొరికిపోయారు. దీంతో మేము మ్యాచ్‌ మీద పట్టు కోల్పోయాం. అదే మా ఓటమికి ప్రధాన కారణం.

కైల్ మైర్స్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి. అతడు మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కైల్‌ తనకు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇక బిష్ణోయ్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడు కీలక సమయాల్లో మాకు వికెట్లను అందిస్తున్నాడు" అని పేర్కొన్నాడు. ఇక లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌7న ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది.
చదవండి: Rishabh Pant: మీకసలు బుద్ధుందా? ఇదేం పని? చీవాట్లు పెట్టిన ఫ్యాన్స్‌.. బీసీసీఐ కూడా

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)