Breaking News

అది నా చేతుల్లో లేదు.. అంతా కెప్టెన్ ఇష్ట‌మే: శార్ధూల్‌ ఠాకూర్‌

Published on Fri, 07/25/2025 - 09:49

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్ బ్యాట్‌తో రాణించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శార్ధూల్‌.. 88 బంతులు ఎదుర్కొని 41 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం మ‌రోసారి లార్డ్ ఠాకూర్ తేలిపోయాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 5 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ వికెట్ ఏమీ తీయ‌కుండా 35 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. లీడ్స్‌లో జ‌రిగిన తొలి టెస్టులో విఫ‌ల‌మం కావ‌డంతో శార్ధూల్‌పై టీమ్‌మెనెజ్‌మెంట్‌పై వేటు ప‌డింది. ఆ త‌ర్వాత‌ రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన ఈ ముంబై ఆల్‌రౌండ‌ర్‌.. తిరిగి మళ్లీ మాంచెస్ట‌ర్ టెస్టులో ఆడేందుకు అత‌డికి ఛాన్స్ ల‌భించింది.

అయితే బౌల‌ర్‌గా శార్ధూల్ సేవ‌ల‌ను టీమిండియా స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దేశ‌వాళీ క్రికెట్‌లో బౌల‌ర్‌గా అద్బుతంగా రాణిస్తున్న ఠాకూర్‌కు మొద‌టి టెస్టులో కేవ‌లం 16 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసే అవ‌కాశం ద‌క్కింది. 

ఇప్పుడు మాంచెస్ట‌ర్ టెస్టులో కూడా కేవ‌లం 5 ఓవ‌ర్లు మాత్ర‌మే శార్ధూల్‌తో గిల్ బౌలింగ్ చేయించాడు. తాజాగా ఇదే విష‌యంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని బౌలింగ్ చేయాలనేది కెప్టెన్ ఇష్ట‌మే అని ఠాకూర్ తెలిపాడు.

"ఒక బౌల‌ర్‌కు బౌలింగ్ ఇవ్వ‌డం, ఇవ్వ‌క‌పోవ‌డం అది కెప్టెన్ నిర్ణ‌యం. అది నా చేతుల్లో లేదు. బౌలింగ్‌లో ఎప్పుడు ఎవ‌రిని ఎటాక్‌లోకి తీసుకురావాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఈ మ్యాచ్‌లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. మ‌రిన్ని ఓవ‌ర్లు బౌలింగ్ చేసే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాను" అని రెండో రోజు ఆట అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో ఠాకూర్ పేర్కొన్నాడు.

ఇక మాంచెస్ట‌ర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశ‌గా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అంత‌కుముందు భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగుల‌కు ఆలౌటైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)