చిన్న జట్లకు ప్రతిబంధకం

Published on Sat, 07/18/2026 - 03:45

దుబాయ్‌: వన్డే ప్రపంచకప్‌లో కొత్తగా తీసుకొచ్చిన మార్పులపై వరల్డ్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూసీఏ) సందేహాలు వ్యక్తం చేసింది. సూపర్‌ సిరీస్, సూపర్‌ 7 వంటి మార్పులు పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొంది. వచ్చే ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో 10 జట్లు పోటీపడగా... 2027లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి సూపర్‌ సిరీస్, సూపర్‌–7, సెమీఫైనల్, ఫైనల్‌ తరహాలో టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. 

వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన 14 జట్లలో చివరి మూడు (12వ, 13వ, 14వ) స్థానాల్లో ఉన్న జట్లతో ముందుగా రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సూపర్‌ సిరీస్‌ నిర్వహిస్తారు. అందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ముందంజ వేయనుండగా... మిగిలిన రెండు జట్లు వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమిస్తాయి. ఈ నేపథ్యంలో... ఆయా జట్లతో చర్చించకుండానే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీనిపై డబ్ల్యూసీఏ స్పందిస్తూ... ‘మెగా టోర్నమెంట్‌లను ఎలా నిర్వహించాలని నిర్ణయించే అధికారం ఐసీసీకి ఉంది. అయితే ఇలాంటి పెను మార్పులు చేసేటప్పుడు సంప్రదింపులు జరపాల్సిన అవసరముంది. 

ఎన్నో దేశాల ఆటగాళ్లు వరల్డ్‌కప్‌లో ప్రధాన జట్లతో పోటీపడాలని అనుకుంటూ ఉంటారు. అలాంటిది సూపర్‌ సిరీస్‌ కారణంగా కేవలం ఒక్క జట్టు మాత్రమే ముందంజ వేసే అవకాశం ఉంది. మరి ప్లేయర్లు ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి తగిన ఫలితం ఎలా దక్కుతుంది. ఒకవైపు క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలని ప్రకటిస్తూనే... మరోవైపు కొత్త జట్ల అవకాశాలను తగ్గించే నిర్ణయం తీసుకోవడం పరస్పర విరుద్ధంగా అనిపిస్తోంది. ఇది పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది’ అని డబ్ల్యూసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ నిర్ణయంపై నెదర్లాండ్స్‌ జట్టు కెప్టెన్  స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ కూడా నిరాశ వ్యక్తంచేశాడు. 

‘క్రికెట్‌ ఆడే ఏ దేశానికైనా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించడం ఒక గొప్ప విజయం. కాబట్టి నాలుగేళ్ల ప్రణాళక తర్వాత ఒక్కసారి వచ్చే అలాంటి అవకాశం చేజారినప్పుడు ప్లేయర్లు నిరాశకు గురవుతారు’ అని ఎడ్వర్డ్స్‌ అన్నాడు. ఐర్లాండ్‌ సారథి పాల్‌ స్టిర్లింగ్‌ మాట్లాడుతూ...‘ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత వృద్ధి చేయాలని ఐసీసీ చాలా మాట్లాడుతుంది. కానీ ఇలాంటి నిర్ణయాలు అసోసియేట్‌ దేశాల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. అగ్రశ్రేణి జట్లతో ఆడే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తాయి’ అని అన్నాడు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)