జద్రాన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. అఫ్గన్‌ రికార్డు స్కోరు..

Published on Tue, 11/07/2023 - 19:47

ICC WC 2023- Ibrahim Zadran: వన్డే వరల్డ్‌కప్‌-2023లో అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పటిష్ట పేస్‌ దళం ఉన్న కంగారూ జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో మెరిశాడు. మొత్తంగా 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 129 పరుగులు రాబట్టాడు.

ఈ క్రమంలో అఫ్గన్‌ తరఫున ప్రపంచకప్‌ చరిత్రలో సెంచరీ చేసి తొలి బ్యాటర్‌గా నిలిచిన 21 ఏళ్ల ఇబ్రహీం.. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. 

వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో జింబాబ్వే ఆటగాడు నీల్‌ జాన్సన్‌ 132* పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ క్రిస్‌ హ్యారిస్‌ 130 పరుగులతో రెండో స్థానం ఆక్రమించాడు. 

కష్టాల్లో ఆసీస్‌
కాగా అఫ్గనిస్తాన్‌ విధించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అద్భుత ఆట తీరుతో అర్ధ శతకం పూర్తి చేసుకుని ఆసీస్‌ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు.

ప్రపంచకప్‌ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన టాప్‌-5 క్రికెటర్లు
1. నీల్‌ జాన్సన్‌(జింబాబ్వే)- 132* పరుగులు- 1999లో లార్డ్స్‌ మైదానంలో
2. క్రిస్‌ హ్యారిస్‌(న్యూజిలాండ్‌)- 130 పరుగులు- 1996లో చెన్నైలో
3. ఇ‍బ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్‌)- 129* పరుగులు- 2003 ముంబైలో
4. శిఖర్‌ ధావన్‌(ఇండియా)- 117 పరుగులు- 2019లో ది ఓవల్‌లో
5. రచిన్‌ రవీంద్ర(న్యూజిలాండ్‌)- 116 పరుగులు- 2023లో ధర్మశాలలో.

అఫ్గనిస్తాన్‌కు ఇదే భారీ స్కోరు:
ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా.. అఫ్గనిస్తాన్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. జద్రాన్‌ అజేయ శతకం కారణంగా 291 పరుగులు సాధించి ఈ మేరకు తమ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది.

వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్‌ సాధించిన టాప్‌-5 స్కోర్లు ఇవే
►ఆస్ట్రేలియా మీద- 2023లో ముంబైలో- 291/5.
►వెస్టిండీస్‌ మీద- 2019లో లీడ్స్‌లో- 288.
►పాకిస్తాన్‌ మీద- 2023లో చెన్నైలో- 286/2.
►ఇంగ్లండ్‌ మీద- 2023లో ఢిల్లీలో- 284.
►టీమిండియా మీద- 2023లో ఢిల్లీలో- 272/8.

చదవండి: వరల్డ్‌కప్‌లో అఫ్గన్‌ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్‌, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)