Breaking News

కపిల్‌ దేవ్‌, ధోనికి సాధ్యం కాలేదు! రోహిత్‌కు కలిసొచ్చింది.. అరుదైన రికార్డు

Published on Fri, 11/03/2023 - 15:44

ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకు ముందు భారత జట్టుకు సారథ్యం వహించిన ఆటగాళ్లెవరికీ సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు. కాగా భారత్‌ వేదికగా పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలో 2011 ఫైనల్లో ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకను చిత్తు చేసి నాటి జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరోసారి ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది భారత్‌.

ఈ క్రమంలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్‌ సేన.. ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఏ వేదిక మీదైతే టైటిల్‌ గెలిచిందో అదే వేదిక మీద తాజా వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

కాగా వాంఖడే రోహిత్‌ శర్మకు సొంతమైదానం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్‌ చరిత్రలో అతడు అరుదైన ఘనత సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో వరల్డ్‌కప్‌ టోర్నీలో హోంగ్రౌండ్‌లో సారథిగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు.

1983లో తొలిసారి టీమిండియాకు వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించిన కపిల్‌ దేవ్‌ 1987లోనూ కెప్టెన్‌గానూ ఉన్నాడు. అయితే, అప్పుడు భారత్‌లోనే ఐసీసీ ఈవెంట్‌ జరిగినప్పటికీ కపిల్‌ దేవ్‌ స్వస్థలం చండీగఢ్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

ఇక వరల్డ్‌కప్‌-1996లో మహ్మద్‌ అజారుద్దీన్‌ సారథ్యంలోని టీమిండియా కూడా అజారుద్దీన్‌ సొంత మైదానం హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడింది లేదు.  అదే విధంగా 2011 ప్రపంచకప్‌ టోర్నీలోనూ ధోని స్వస్థలం రాంచిలోనూ భారత జట్టు మ్యాచ్‌ ఆడలేదు. నిజానికి 2013 తర్వాత అక్కడ తొలి అంతర్జాతీయ స్టేడియం నిర్మించారు. 

చదవండి: వారసత్వాన్ని నిలబెడతాడని తండ్రికి నమ్మకం! వివాదాలు చుట్టుముట్టినా..

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)