Breaking News

కొడుకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్నాడు.. టీమిండియాకు తండ్రి సపోర్టు! రోహిత్‌ జెర్సీతో

Published on Sun, 10/08/2023 - 17:55

ICC ODI WC 2023: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో తమ ఆరంభ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ క్రమంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ భారత జట్టును విష్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. తన కుమారుడు ప్రపంచకప్‌-2023లో ఈవెంట్లో ఆడుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మద్దతుగా నిలుస్తూ.. హిట్‌మ్యాన్‌పై అభిమానం చాటుకున్నాడు.

ఆ వ్యక్తి ఎవరంటే.. సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడ తండ్రి ఎంఫో రబడ. ‘‘ఈరోజు టీమిండియాకు నా మద్దతు’’ అంటూ రోహిత్‌ శర్మ పేరిట జెర్సీని ధరించి భారత జట్టును విష్‌ చేశాడు. రబడ తండ్రి చేసిన ప్రయత్నం రోహిత్‌ ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది.

కాగా తన తనయుడు కగిసో రబడకు చీర్‌ చేసేందుకు ఎంఫో రబడ భారత్‌కు వచ్చాడు. ఢిల్లీలో సౌతాఫ్రికా- శ్రీలంక మధ్య శనివారం నాటి మ్యాచ్‌కు హాజరై.. తన కుమారుడికి మద్దతు తెలిపాడు. కాగా లంకపై ప్రొటిస్‌ జట్టు ఏకంగా 102 పరుగుల తేడాతో గెలుపొంది ఘనంగా ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించింది. 

ఈ మ్యాచ్‌లో రబడ 7.5 ఓవర్ల బౌలింగ్‌లో 50 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక నవంబరు 5న టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరుగనుంది. మరి అప్పుడు ఎంఫో రబడ ఏం చేస్తాడో చూడాలి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: #Ducks: ఆనందం కాసేపు కూడా లేదు! నువ్వేం కెప్టెన్‌? గోల్డెన్‌ డక్‌ బాయ్‌ నువ్వేమో..

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)