Breaking News

పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌..

Published on Sat, 11/11/2023 - 21:37

వన్డే ప్రపంచకప్‌-2023ను ఇంగ్లండ్‌ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్‌ రషీద్‌, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.

పాకిస్తాన్‌ బ్యాటర్లలో అఘా సల్మాన్‌(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ స్టోక్స్‌(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్‌ ఆడగా.. జోరూట్‌(60), జానీ బెయిర్‌ స్టో(59) పరుగులతో రాణించారు.

ఆఖరిలో హ్యారీ బ్రూక్‌(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్‌ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు.  పాకిస్తాన్‌ బౌలర్లలో హ్యారీస్‌ రవూఫ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్‌ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)