Breaking News

కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం: పాండ్యా

Published on Mon, 10/24/2022 - 12:01

T20 World Cup 2022 - Ind Vs Pak- Virat Kohli- Hardik Pandya: ‘‘విరాట్‌ కోహ్లి కొట్టిన ఆ రెండు షాట్లు ఎంత ముఖ్యమైనవో నాకు బాగా తెలుసు. ఒకవేళ గనుక కోహ్లి ఒక్క షాట్‌ మిస్‌ చేసినా.. వాళ్లు మనపై ఒత్తిడి పెంచేవాళ్లు. నేను చాలాసార్లు సిక్సర్లు బాదాను. అయితే, ఈ రెండు సిక్స్‌లు మాత్రం ఎంతో ఎంతో ప్రత్యేకమైనవి. 

మా ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైనవి. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో షాట్లు ఆడాను. కానీ ఇలాంటి షాట్లు మాత్రం మిస్టర్‌ కోహ్లి తప్ప ఇంకెవరూ కొట్టలేరు’’ అంటూ టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా .. రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

విలువైన ఇన్నింగ్స్‌ ఆడి
టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి(53 బంతుల్లో 82 పరుగులు- నాటౌట్‌), పాండ్యా(37 బంతుల్లో 40 పరుగులు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు విజయం అందించిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించి గెలుపు బాట పట్టించారు. 

ఆ రెండు సిక్స్‌లు ఇంకెవరికీ సాధ్యం కావు
ముఖ్యంగా కీలకమైన సమయంలో కోహ్లి విశ్వరూపం ప్రదర్శించడంతో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కోహ్లితో ముచ్చటించిన హార్దిక్‌.. ​కింగ్‌ మరపురాని ఇన్నింగ్స్‌ గురించి మరోసారి గుర్తుచేసుకున్నాడు. 19వ ఓవర్లో హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన రెండు సిక్స్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయని పేర్కొన్నాడు.

ఒత్తిడికి లోనయ్యాను.. అయితే
అదే విధంగా పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా తన అనుభవాల గురించి పంచుకుంటూ.. ‘‘నేను కాస్త ఒత్తిడికి లోనయ్యాను. మైదానంలోకి వచ్చే ముందు ఎందుకో నా మనసు అల్లకల్లోంగా మారింది. అయితే, ప్రతికూలతలు, ఒత్తిడిని అధిగమించి నేను ఈరోజు ఇలా ఆడగలిగానంటే జట్టులోని సభ్యుల సహకారం వల్లే.

నీకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఆడాను. ఎందుకంటే ఛేజింగ్‌లో నువ్వేం చేయగలవో అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నీకంటే గొప్పగా ఎవరు ఆడగలరు’’ అంటూ కోహ్లితో వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 4 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్‌ సేన శుభారంభం చేసింది. 

చదవండి: T20 WC 2022 Ind Vs Pak: 'ఆడింది చాలు ఇక వెళ్లు'.. హార్దిక్‌ చర్య వైరల్‌
T20 WC PAK Vs IND: కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు రోహిత్‌ ఫిదా.. భుజంపై ఎత్తుకుని మరి!

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)