Breaking News

అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్‌ కెప్టెన్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published on Sun, 07/23/2023 - 10:48

ట్రినిడాడ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి విండీస్‌ 229 పరుగులు చేసింది. కరేబియన్‌ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అలిక్‌ అతనజ్‌(37), హోల్డర్‌(11) పరుగులతో ఉన్నారు. అంతకుముందు విండీస్‌ కెప్టెన్‌ క్రెగ్‌ బ్రాత్‌వైట్‌(75) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌..
ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌ కెప్టెన్‌ క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ను భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. అశ్విన్‌ వేసిన డెలివరికి బ్రాత్‌వైట్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. విండీస్‌ ఇన్నింగ్స్‌ 75 ఓవర్‌ వేసిన అశ్విన్‌ బౌలింగ్‌లో మూడో బంతిని బ్రాత్‌వైడ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

అయితే ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన విండీస్‌ కెప్టెన్‌ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి అతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. రెండో టెస్టులో ఇప్పటివరకు 33 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అశ్విన్‌ ఓ కీలక వికెట్‌ సాధించాడు.
చదవండి: పెళ్లి చేసుకున్న సన్‌రైజర్స్‌ ​కెప్టెన్‌.. అమ్మాయి ఎవరంటే?

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)