Breaking News

కిషన్‌ టీ20లకు పనికిరాడు.. ఆ యువ ఆటగాడికి ఛాన్స్‌ ఇవ్వండి!

Published on Sun, 08/06/2023 - 12:38

గయానా వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి మ్యాచ్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని హార్దిక్‌ సేన భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించి మంచి జోష్‌ మీద ఉన్న విండీస్‌ మాత్రం.. అదే జోరును కనబరిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. ఇక రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20కు ఇషాన్‌ కిషన్‌ స్ధానంలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని జాఫర్‌ సూచించాడు.

కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన కిషన్‌.. ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన మొదటి టీ20లో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్‌ మాత్రమే కాకుండా టీ20ల్లో అంత మంచి రికార్డు కిషన్‌కు లేదు. ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన కిషన్‌.. 25 కంటే తక్కువ సగటుతో 659 పరుగులు చేశాడు.

"విండీస్‌తో రెండో టీ20లో యశస్వి జైస్వాల్‌ని చూడాలనుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. ఇషాన్‌ కిషన్‌ స్ధానంలో జైశ్వాల్‌ ఛాన్స్‌ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిషన్‌ టీ20ల్లో పేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు.  గత 15 ఇన్నింగ్స్‌లలో అతడు 40 పరుగులు కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది.

కాబట్టి అతడిని పక్కన పెడితే మంచింది. అయితే అతడు వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీ20 అనేది భిన్నమైన ఫార్మాట్. అతడు ఐపీఎల్‌లో కూడా అంతగా రాణించలేకపోయాడు. జైశ్వాల్‌ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్‌లో దుమ్మురేపాడు. అందుకే అతడు కచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి" అని జాఫర్‌ క్రిక్‌ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్‌ పేర్కొన్నాడు.
చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్‌ కీపింగ్‌.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)