Breaking News

T20 WC: వచ్చే వరల్డ్‌కప్‌లో వాళ్లకు కోహ్లి, రోహిత్‌ అవసరం లేదు.. ఎందుకంటే?

Published on Sat, 02/04/2023 - 12:56

T20 World Cup 2024- Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 కెరీర్‌ గురించి మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో హిట్‌మ్యాన్‌ ఆడే అవకాశం లేదని అంచనా వేశాడు. మాజీ సారథి విరాట్‌ కోహ్లి మాత్రం ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌లో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉందని పేర్కొన్నాడు.

కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌-2022లో రోహిత్‌ కెప్టెన్సీలోని భారత జట్టు సెమీస్‌ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో వరుస విజయాలు నమోదు చేసినప్పటికీ.. మెగా టోర్నీలో మాత్రం ఫైనల్‌ చేరలేక చతికిలపడింది.

హార్దిక్‌ సారథ్యంలో
ఇక ఈ ఈవెంట్‌ తర్వాత పనిభారాన్ని తగ్గించే పేరిట రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు విశ్రాంతినిస్తూ వస్తోంది మేనేజ్‌మెంట్‌. అదే సమయంలో శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి యువకులకు వరుస అవకాశాలు ఇస్తోంది. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ప్రపంచకప్‌ నాటికి జట్టును పరిపుష్టం చేసే పనిలో ఉంది.

వాళ్లకు రోహిత్‌, కోహ్లి అవసరం లేదు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. 35 ఏళ్ల రోహిత్‌ శర్మ ఇప్పటికే తన టీ20 వరల్డ్‌కప్‌ ఆడేశాడని వ్యాఖ్యానించాడు. ఇక యువకులకు మార్గం సుగమం చేయాలని.. ఈ ఫార్మాట్‌లో వారికి మెరుగైన భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. అయితే, కోహ్లి మాత్రం టీ20లలో కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయన్నాడు.

అంతేకాకుండా... ఇప్పటికే యువ క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం మెండుగా ఉందని.. కాబట్టి కోహ్లి, రోహిత్‌ల మార్గదర్శనం పెద్దగా వారికి అవసరం లేదని వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే వీళ్లిద్దరు జట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉందని పేర్కొన్నాడు. 

కోహ్లి ఉంటాడు.. రోహిత్‌ కాదు
ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఈ మేరకు అభిప్రాయాలు పంచుకున్న వసీం జాఫర్‌.. ‘‘శ్రీలంక, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లలో కూడా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చారు. వీటి తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌, ఆ తర్వాత ఐపీఎల్‌.. ఆపై వన్డే వరల్డ్‌కప్‌. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇలాంటి నిర్ణయాలు.

ఇక ఆసీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయాలు పక్కనపెడితే.. ఇక టీ20 ఫార్మాట్‌..

ఇందులో భవిష్యత్‌ అంతా యువ ఆటగాళ్లదే. రోహిత్‌ శర్మ రానున్న టీ20 వరల్డ్‌కప్‌ ఆడతాడని నేను అనుకోవడం లేదు. అయితే, విరాట్‌కు అవకాశం ఉంది. కానీ రోహిత్‌ విషయంలో అలా కాదు.. ఇప్పటికే అతడి వయసు 36 ఏళ్లు అనుకుంటా.. కాబట్టి తను మాత్రం కచ్చితంగా వచ్చే ఎడిషన్‌లో ఉండడు’’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్‌ వణికిపోతోంది! నిదర్శనమిదే..
ILT20: ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్‌.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)