నా కొడుకు ఏమి త‌ప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్‌ తండ్రి ఫైర్‌

Published on Tue, 07/29/2025 - 12:13

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించ‌డంలో ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుందర్‌ది కీల‌క పాత్ర‌. ఈ మ్యాచ్‌లో సుంద‌ర్ త‌న విరోచిత పోరాటంతో జ‌ట్టును ఓట‌మి నుంచి గ‌ట్టెక్కించాడు. మ‌రో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాతో క‌లిసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెల‌కొల్పాడు.

ఈ త‌మిళనాడు ఆట‌గాడు మొత్తంగా 206 బంతులు ఎదుర్కొని 101 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సుంద‌ర్‌పై అంద‌రూ ప్రంశ‌స‌ల వ‌ర్షం కురిపిస్తుంటే.. అత‌డి తండ్రి మ‌ణి సుంద‌ర్ మాత్రం కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.  త‌న కుమారుడు నిల‌క‌డ‌గా రాణిస్తున్న‌ప్ప‌టికి, జాతీయ జ‌ట్టులో ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని భార‌త సెల‌క్ట‌ర్ల‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు

"వాషింగ్ట‌న్ త‌ను ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిస్తున్నాడు. గ‌త కొంతకాలంగా అత‌డు నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. కానీ వాషీకి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. భార‌త జ‌ట్టు అభిమానులు సైతం సుంద‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను గుర్తించ‌డం లేదు. మిగితా ఆట‌గాళ్లు బాగా ఆడ‌క‌పోయినా, వారికి క్రమం త‌ప్ప‌కుండా అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. 

నా కొడుకు మాత్రం బాగా ఆడిన కూడా  రెగ్యూల‌ర్‌గా ఛాన్స్‌లు లభించలేదు. నాలుగో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ట్ల‌గానే మిగితా మ్యాచ్‌ల‌లో కూడా అదే పొజిషన్‌లో అత‌డిని పంపాలి. వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల‌లో నా కుమారుడిని ఆడించాలి. 

ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో వాషీకి చోటు ద‌క్క‌క‌పోవ‌డం న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సెల‌క్ట‌ర్లు అత‌డి ప్ర‌ద‌ర్శ‌ల‌న‌పై ఓ క‌న్నేసి ఉంచాలి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎంమ్ సుంద‌ర్ పేర్కొన్నాడు.

2021లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సుందర్‌.. ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 12 మ్యాచ్‌లలో 44.87 సగటుతో 673 పరుగులు చేసిన వాషీ.. 32 వికెట్లు కూగా పడగొట్టాడు.
చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)