Breaking News

టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌

Published on Thu, 01/29/2026 - 09:16

టీ20 వరల్డ్‌కప్‌-2026కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌. న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో గాయ‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు అత‌డు దూరం కానున్నట్లు సమాచారం.

పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న సుందర్‌.. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో కోలుకుంటున్నాడు. వాషీ తాజాగా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే ప్రాక్టీస్ సంద‌ర్భంగా ఇంకా పక్కటెముకల వద్ద నొప్పి ఉండటంతో అతను ఇబ్బంది పడుతున్నట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే గ్రూప్ స్టేజ్‌లో భార‌త్ ఆడే రెండు(అమెరికా, న‌మీబియా) మ్యాచ్‌ల‌కు అత‌డు దూరం కానున్నాడు. అయితే ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా జ‌ర‌గ‌నున్న భార‌త్‌-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ నాటికి సుంద‌ర్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

"పాక్‌తో మ్యాచ్‌కు ఇంకా  15 రోజుల సమయం ఉంది. అప్ప‌టికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ కోలుకుంటాడనే నమ్మకంతో ఉన్నాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి అత‌డు మాకు చాలా ముఖ్యం. ప్ర‌స్తుతం జ‌ట్టులో ఆఫ్-స్పిన్  బౌల‌ర్లు త‌క్కువ‌గా ఉండ‌డంతో ర‌వి బిష్ణోయ్‌ను ఉప‌యోగించుకుంటున్నాము" అని బీసీసీఐ సీనియ‌ర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సుంద‌ర్‌కు ప్రత్యామ్నాయంగా ర‌వి బిష్ణోయ్‌ను సెలెక్ట‌ర్లు జ‌ట్టులోకి తీసుకున్నారు.
చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)