Breaking News

డేవిడ్‌ వార్నర్‌ వరల్డ్‌ రికార్డు!.. కానీ అతడి జట్టుకు ఓటమి తప్పలేదు!

Published on Thu, 06/26/2025 - 12:13

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఫ్రాంఛైజీ క్రికెట్‌తో అలరిస్తున్నాడు ఆస్ట్రేలియా స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner). ప్రస్తుతం మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC) టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న వార్నర్‌ భాయ్‌.. తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అటు అంతర్జాతీయ క్రికెట్‌లో.. ఇటు పొట్టి ఫార్మాట్‌ లీగ్‌లలో 200 క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఎంఎల్‌సీలో వార్నర్‌ సీటెల్‌ ఒర్కాస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక గురువారం నాటి మ్యాచ్‌లో సీటెల్‌.. డల్లాస్‌ వేదికగా శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో తలపడింది.

శాన్‌ ఫ్రాన్సిస్కో మెరుగైన స్కోరు
ఇందులో టాస్‌ గెలిచిన సీటెల్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుని శాన్‌ ఫ్రాన్సిస్కో టీమ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్‌, కెప్టెన్‌ మాథ్యూ షార్ట్‌ (29 బంతుల్లో 52)తో పాటు.. జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ (21 బంతుల్లో 34), రొమారియో షెఫర్డ్‌ (31 బంతుల్లో 56) రాణించగా.. శాన్‌ ఫ్రాన్సిస్కో మెరుగైన స్కోరు సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీటెల్‌ బౌలర్లలో గెరాల్డ్‌ కోయెట్జి, హర్మీత్‌ సింగ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. గెనాన్‌, ఒబెడ్‌ మెకాయ్‌ తలా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

 టీ20లలో 200 క్యాచ్‌లు
ఇక వార్నర్‌ కోయెట్జి బౌలింగ్‌లో ఫిన్‌ అలెన్‌ (4) ఇచ్చిన క్యాచ్‌తో పాటు.. హర్మీత్‌ బౌలింగ్‌లో మెగర్క్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20లలో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్‌గా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే కొనసాగుతున్నాడు. 652 మ్యాచ్‌లలో కలిపి అతడు 449 క్యాచ్‌లు అందుకున్నాడు. మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్‌ల వీరుడిగా వెస్టిండీస్‌ స్టార్‌ కీరన్‌ పొలార్డ్‌ ఉన్నాడు. అతడు 386 క్యాచ్‌లు అందుకున్నాడు.

అయితే, వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 383 మ్యాచ్‌లలో 223 క్యాచ్‌లు అందుకోవడంతో పాటు.. టీ2- ఫార్మాట్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో.. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

సీటెల్‌కు తప్పని ఓటమి
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని సీటెల్‌ ఒర్కాస్‌ ఛేదించలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. 

సీటెల్‌ బ్యాటర్లలో ఓపెనర్లు షయాన్‌ జహంగీర్‌ (40), డేవిడ్‌ వార్నర్‌ (23).. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (30) మాత్రమే రాణించారు. శాన్‌ ఫ్రాన్సిస్కో బౌలర్లలో హ్యారిస్‌ రవూఫ్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మాథ్యూ షార్ట్‌ మూడు, షెఫర్డ్‌ రెండు, జేవియర్‌ బ్రాట్‌లెట్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)