తండ్రి బాటలోనే కొడుకులు..సెహ్వాగ్ వారసులపై కాసుల వర్షం!

Published on Thu, 07/02/2026 - 15:27

న్యూ ఢిల్లీ వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) మూడో సీజన్ వేలం ఘనంగా ముగిసింది. రైజింగ్ స్టార్స్‌ను తీసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్న కొడుకు ఎంపికవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సెహ్వాగ్ చిన్న కుమారుడు 16 ఏళ్ల వేదాంత్ సెహ్వాగ్ ఈ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. ఇతడిని రూ. 1 లక్షకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. వేదాంత్ ఇప్పటికే అండర్-14, 16 టోర్నమెంట్లలో తన మార్క్ చూపించాడు. వేదాంత్ తండ్రిలా కాకుండా  రైట్ ఆర్మ్ ఆఫ్-స్పిన్నర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు.

అదేవిధంగా సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను రూ. 3 లక్షల ధరకు వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఇతడు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక కోహ్లి అన్న కుమారుడు ఆర్యవీర్ కోహ్లిని రూ.1.2 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. ఆర్యవీర్ గత సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

తేజస్విపై కాసుల వర్షం
ఇక మూడో ఎడిషన్ వేలంలో తేజస్వి దహియా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తమ 'రైట్ టు మ్యాచ్' కార్డును ఉపయోగించి అతడిని రూ. 40 లక్షలకు దక్కించుకుంది. గత డీపీఎల్ సీజన్‌లో దహియా దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా అతడికి ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా దక్కింది. ఈ ఏడాది సీజన్‌లో అతడు కేకేఆర్ తరపున అరంగేట్రం చేశాడు.

రంజన్‌కు జాక్ పాట్‌
అదేవిధంగా సీనియర్‌ రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్‌కు జాక్ పాట్ తగిలింది.  నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డ్‌ని ఉపయోగించి రూ. 17 లక్షలకు సార్థక్‌ను తిరిగి దక్కించుకుంది. గత సీజన్‌లో సార్థక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 

9 మ్యాచ్‌ల్లో 449 పరుగులు చేసి సత్తాచాటాడు. ఐపీఎల్‌-2026 వేలంలో కూడా అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. మొత్తంగా తాజా వేలంలో 25 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)