Breaking News

'అతడేం తప్పు చేశాడు.. ధ్రువ్ ‌జురెల్‌కు తీవ్ర అన్యాయం'

Published on Mon, 02/26/2024 - 09:24

ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్‌ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడిన ధ్రువ్ జురెల్‌.. ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అయితే మరో ఎంఎస్‌ ధోని దొరికాడంటూ దృవ్‌ను కొనియాడాడు.

కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్‌ చేయడంలో జురెల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్‌ బ్యాటర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు.

అయితే దురదృష్టవ శాత్తూ జురెల్‌ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్‌ను భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్  ప్రశంసించాడు. జురెల్‌కు అద్బుతమైన బ్యాటింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు.  అయితే ధ్రువ్‌ ఇన్నింగ్స్‌కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు.

"ధ్రువ్‌ జురెల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్‌ ఇన్నింగ్స్‌కు అంత హైప్‌ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు.  ధ్రువ్‌కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్‌ సర్‌ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్‌కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్‌ చేశాడు. 

"ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్‌ ఉండాలి. ఈ మ్యాచ్‌లో ఆకాష్‌ దీప్‌ వంటి డెబ్యూ బౌలర్‌ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్‌ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్‌(ఎక్స్‌) చేశాడు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?