ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్‌ కౌంటర్‌

Published on Thu, 04/24/2025 - 20:25

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. స‌న్‌రైజ‌ర్స్ ఇప్ప‌టివర‌కు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 6 ఓటుమ‌ల‌తో త‌మ ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

స‌న్‌రైజ‌ర్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదివ స్ధానంలో కొన‌సాగుతోంది. కాగా ఎస్ఆర్‌హెచ్‌-ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ అనంత‌రం భార‌త మాజీ క్రికెట‌ర్లు వీరేంద్ర సెహ్వాగ్,అమిత్ మిశ్రాలు క్రిక్‌బ‌జ్ లైవ్ షోలో పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ మిశ్రాకు సెహ్వాగ్ కౌంట‌రిచ్చాడు.

అస‌లేమి జ‌రిగిందంటే?
పోస్ట్ మ్యాచ్ లైవ్ షోలో మిశ్రా, సెహ్వాగ్‌లు స‌న్‌రైజ‌ర్స్ ప్లే ఆఫ్ అవ‌కాశాలు గురించి చ‌ర్చించారు. అయితే మిశ్రా మాత్రం ఈ అంశం నుండి దృష్టి మరల్చి,  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ప్లేఆఫ్‌కు చేరుకునే వారి అవకాశాల గురించి మాట్లాడాడు.

"సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేర‌డం దాదాపు అసాధ్యం అనుకుంటున్నాను. వారు ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్ బ్రాండ్ ప్రకారం.. వ‌రుస‌గా ఆరు మ్యాచ్‌లను గెలవడం కష్టం. ఒక‌వేళ గెల‌వాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ బాగా రాణించాలి. ధోని బ్యాటింగ్‌కు వస్తే కనీసం 30 బంతులు ఆడాలి. వారి టాప్ ఆర్డ‌ర్ కూడా రాణించాలి" అని మిశ్రా పేర్కొన్నాడు. 

వెంటనే సెహ్వాగ్ జోక్యం చేసుకుని ప్ర‌శ్న సీఎస్‌కే గురుంచి కాదు, ఎస్ఆర్‌హెచ్ గురించి అని మిశ్రాతో అన్నాడు. దీంతో  మిశ్రా వెంటనే క్షమాపణలు చెప్పాడు.  అందుకు ఇదంతా ధోనికి ఉన్న పేరు వ‌ల్లే అంటూ సెహ్వాగ్ సమాధానమిచ్చాడు.
చ‌ద‌వండి: అత‌డొక అద్భుతం.. రెండేళ్ల‌లో టీమిండియాకు ఆడుతాడు: శాంస‌న్‌

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)