Breaking News

ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైర‌ల్‌

Published on Wed, 05/28/2025 - 13:13

ఐపీఎల్‌-2025లో సోమ‌వారం ఎకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శ‌ర్మ తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ టాప్‌-2 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ల‌క్నో యువ స్పిన్న‌ర్ దిగ్వేష్ సింగ్ రాఠి మ‌రోసారి త‌న చ‌ర్య‌తో వార్త‌ల్లోకెక్కాడు.

అస‌లేమి జ‌రిగిందంటే?
228 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌నలో విరాట్ కోహ్లి(54) ఔట‌య్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శ‌ర్మ క్రీజులోకి వ‌చ్చాడు. జితేష్ త‌న ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండ‌రీలు బ‌ద‌డం మొద‌లుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టికే ఆర్సీబీ కావ‌ల్సిన ర‌న్ రేట్ ఓవ‌ర్‌కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. బౌల‌ర్ల‌ను ఎంత‌మంది మార్చిన అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు.

ఈ క్ర‌మంలో అత‌డి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్న‌ర్ దిగ్వేష్‌ను తిరిగి పంత్ ఎటాక్‌లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవ‌ర్ వేసిన దిగ్వేష్ ఓవ‌రాక్ష‌న్ చేశాడు. జితేష్‌ను త‌న బౌలింగ్‌తో ఆప‌లేక‌పోయిన దిగ్వేష్‌.. అత‌డిని మన్కడింగ్ చేసి పెవిలియ‌న్‌కు పంపాల‌ని ప్ర‌య‌త్నించాడు.  

ఆ ఓవ‌ర్ ఆఖ‌రి బంతిని వేసే క్ర‌మంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్‌ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే రనౌట్‌కు అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు. ప‌లు మార్లు రిప్లేలు ప‌రిశీలించిన థ‌ర్డ్ అంపైర్.. అప్ప‌టికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్ష‌న్ పూర్తి చేయ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు.

పంత్ క్రీడా స్పూర్తి.. 
అయితే ఇదే స‌మ‌యంలో ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించాడు. థ‌ర్డ్ అంపైర్ త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిక‌ముందే పంత్ త‌మ అప్పీల్‌ను వెన‌క్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్‌కు వ‌ద్ద‌కు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కోహ్లి ఫైర్‌..
కాగా దిగ్వేష్ మ‌న్క‌డింగ్‌కు ప్ర‌య‌త్నించ‌డంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. త‌న చేతిలో ఉన్న బాటిల్‌ను కింద‌కు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్న‌ట్లు కోహ్లి సీరియ‌స్ రియాక్ష‌న్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్ప‌టికే త‌న మితిమీరిన ప్ర‌వ‌ర్త‌న‌తో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.

థర్డ్‌ అంపైర్‌ ఎందుకు నాటౌట్‌ ఇచ్చాడంటే?
మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్‌ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్‌ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్‌ మాత్రం తన బౌలింగ్‌ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు.  దీంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. 



 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)