Breaking News

పాకిస్తాన్‌లో ఆడేందుకు కో‍హ్లి ఉవ్విళ్ళూరుతున్నాడు: షోయబ్‌ అక్తర్‌

Published on Thu, 12/05/2024 - 12:41

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 జ‌రుగుతుందా? లేదా అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్‌లో  పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భార‌త జ‌ట్టును పంపేందుకు బీసీసీఐ నిర‌కారించిన సంగ‌తి తెలిసిందే. భార‌త ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించక‌పోవ‌డంతో బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడ‌ల్ నిర్వ‌హించాల‌ని భార‌త క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బోర్డు మాత్రం స‌సేమేర అంటుంది. అయితే ఇటీవ‌లే జ‌రిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో హైబ్రిడ్ మోడ‌ల్‌కు పీసీబీ అంగీక‌రించిందని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

కానీ భార‌త క్రికెట్ బోర్డు ముందు బీసీసీఐ కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో భార‌త్ వేదిక‌గా జ‌రిగే ఐసీసీ ఈవెంట్‌లను కూడా ఇదే హైబ్రిడ్ మోడ‌ల్‌లో నిర్వ‌హించాల‌ని పీసీబీ కోరిన‌ట్లు తెలుస్తోంది.

అయితే పీసీబీ కాండీష‌న్స్‌ను భారత బోర్డు తిరష్క‌రించిన‌ట్లు స‌మాచారం. దీంతో క‌థ మళ్లీ మొద‌టికే వ‌చ్చింది. కాగా పాక్ మాజీ క్రికెట‌ర్లు సైతం భార‌త జ‌ట్టు త‌మ దేశానికి రావాల‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం షోయ‌బ్ అక్త‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

"ఇండియ‌న్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్‌లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వారికి మా దేశంలో ఆడటమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడటం మా జట్టు కంటే భారత జట్టుకే ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లి సైతం పాక్‌లో ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే.. టీవీ రైట్స్, స్పాన్సర్‌షిప్‌లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి.

కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పాక్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు. గతంలో భారత అండర్‌-19 జట్టు తరపున మాత్రం పాక్‌లో కోహ్లి ఆడాడు.
చదవండి‘పింక్‌ బాల్‌’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌
 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు