Breaking News

అనుష్కను మొదటిసారి అక్కడే చూశా; ఆమె పంచ్‌కు ఆశ్చర్యపోయా

Published on Fri, 08/06/2021 - 16:09

లండన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014 నుంచి రిలేషిన్‌షిప్‌లో ఉన్న వారిద్దరు మంచి విరుష్క జంటగా పాపులారిటీ సంపాదించారు. 2017 డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లి, అనుష్క జోడీ.. 2021 జనవరిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు 'వామిక' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి మొదటిసారి అనుష్క శర్మను ఎలా కలిశాడన్నది తాజాగా దినేష్‌ కార్తీక్‌తో జరిగిన ఇంటర్య్వూలో రివీల్‌ చేశాడు. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫస్ట్‌ టైం అనుష్క శర్మను ఏ విధంగా కలుసుకున్నావు అని కార్తీక్‌ కోహ్లిని అడిగాడు. దానికి కోహ్లి.. '' అనుష్కను తొలిసారి కలిసే సమయంలో నేను అందరితో జోక్‌లు వేస్తూ నవ్వించే పనిలో ఉన్నాను. అదే సమయంలో అక్కడికి వచ్చిన అనుష్క శర్మపై కూడా జోక్‌ వేశాను. ఆరోజు ఆమె హై హీల్స్‌ వేసుకొని వచ్చింది. ఏంటీ మీకు ఇంతకంటే ఎత్తు చెప్పులు దొరకలేదా? అని సరదాగా అడిగాను. దీంతో అనుష్క నాపై సీరియస్‌ అవడమేగాక పంచ్ కూడా వేసింది. '' నేనేమీ ఆరడుగులు లేను. అందుకే.. హై హీల్స్ వేసుకున్నా..'' అని సమాధానం ఇచ్చింది.

ఆమె మాటలు విని షాక్‌కు గురయ్యా. అంతేగాక చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి జోక్‌ చేస్తున్న ఈ వ్యక్తిని చూస్తే నాకు చిన్న పిల్లాడిలా కనిపించాడని పేర్కొంది. అక్కడే నేను మొదటిసారి అనుష్కకు కనెక్టయ్యాను'' అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక కూతురి గురించి చెబుతూ.. '' వామిక నా జీవితంలోకి రావడం మరో అద్భుత ఘట్టం. తనని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నా బిడ్డకు సోషల్ మీడియా అంటే ఏంటో పూర్తిగా తెలిసే వరకూ తనను సోషల్ మీడియాలో ఫోకస్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నా'' అంటూ తెలిపాడు. 

ప్రస్తుతం కోహ్లి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లి బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. అండర్సర్‌ బౌలింగ్‌లో కోహ్లి గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మూడుసార్లు గోల్డెన్‌డక్‌ అయి చెత్త రికార్డు నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఐదోసారి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగి మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.

Videos

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)