థాంక్యూ శిఖర్‌.. లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు: కోహ్లి

Published on Sun, 08/25/2024 - 12:54

టీమిండియా వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న 14 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్న‌నేష‌నల్ క్రికెట్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ నుంచి ధావ‌న్ త‌ప్పుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

ఇప్ప‌టికే  వీరేంద్ర సెహ్వాగ్, స‌చిన్ టెండూల్క‌ర్‌, ల‌క్ష్మ‌ణ్, గౌతం గంభీర్ వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు విషెస్ తెల‌ప‌గా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి చేరాడు. ధావ‌న్‌ను ఉద్దేశించి కోహ్లి ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. గ‌బ్బ‌ర్‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానుల‌తో కింగ్ కోహ్లి పంచుకున్నాడు. 

"శిఖ‌ర్‌.. నీ ఘ‌న‌మైన అరంగేట్రం నుంచి టీమిండియా అద్భుత‌మైన ఓపెన‌ర్ల‌లో ఒక‌డిగా మారేవ‌ర‌కు మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు. ఆట పట్ల మీ అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము కచ్చితంగా మిస్ అవుతాము. కానీ మీ లెగ‌సీ మాత్రం కొన‌సాగుతుంది. 

ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఆఫ్‌ది ఫీల్డ్ మొదలు పెట్టబోయే నీ రెండో ఇన్నింగ్స్‌కు ఆల్ దిబెస్ట్ అని" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు. కాగా కోహ్లి, ధావ‌న్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. ఇద్ద‌రూ క‌లిసి ఢిల్లీ త‌ర‌పున జూనియ‌ర్ క్రికెట్ కూడా ఆడారు. కాగా టీమిండియాకు  167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో ధావన్‌ ప్రాతినిథ్యం వ‌హించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్‌ ధావన్‌ ఖాతాలో ఉన్నాయి.

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)