Breaking News

వరల్డ్‌ నెం1 ర్యాంక్‌కు చేరువలో కోహ్లి.. గిల్‌ను వెనక్కి నెట్టి

Published on Wed, 12/03/2025 - 15:35

ఐసీసీ వన్డే  బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో  కోహ్లి భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి  నాలుగో స్ధానానికి చేరుకున్నాడు. 

రాంచీ వన్డేలో సెంచరీతో సత్తాచాటడంతో కోహ్లి(751 రేటింగ్ పాయింట్లు) తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. విరాట్ కంటే ముందు ఇబ్రహీం జద్రాన్‌(764), డార్లీ మిచెల్‌(766 రేటింగ్‌ పాయింట్లు), రోహిత్‌ శర్మ(783) ఉన్నారు. అగ్రస్ధానంలో రోహిత్‌ కంటే విరాట్‌ ఇంకా కేవలం 33 రేటింగ్‌ పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు. 

ప్రస్తుతం రాయ్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో కింగ్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడితే రోహిత్‌ను అధిగమించడం ఖాయం. రెండో వన్డేలో రోహిత్‌ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.కాగా వన్డేల్లో కోహ్లి 2018 నుంచి 2021 వరకు దాదాపు మూడేళ్ల పాటు వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు. 

ఆ తర్వాత పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం.. కోహ్లి స్ధానంలో దూసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోహ్లి ఒక్కసారి కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన  కింగ్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడటమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.
చదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)