చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌

Published on Sun, 01/11/2026 - 19:22

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన విరాట్‌.. ఇప్పుడు కివీస్‌తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధిం‍చిన ప్లేయర్‌గా విరాట్  వరల్డ్ రికార్డు సృష్టించాడు.

కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముగ్గురే ముగ్గురు 28,000 ప‌రుగులు సాధించారు.  కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), స‌చిన్ టెండూల్క‌ర్‌(34,357) ఈ ఘ‌న‌త సాధించారు.

సంగక్కర రికార్డు బ్రేక్‌..
అదేవిధంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్‌లోనే 42 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌డు ఈ ఫీట్ సాధించాడు. ఇంత‌కుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్‌తో అత‌డిని కోహ్లి అధిగ‌మించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్క‌డే ఉన్నాడు. అయితే కోహ్లి కేవ‌లం ఒక్క ఫార్మాట్‌లో మాత్ర‌మే ఆడుతుండ‌డంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మనే చెప్పాలి.
చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)