Breaking News

టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది: రోహిత్‌ శర్మ

Published on Sun, 09/18/2022 - 15:14

టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్‌20) జరగనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు విలేకురల సమావేశంలో పాల్గొనున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లి భారత్‌ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందిని రోహిత్‌ తెలిపాడు. కాగా ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో సెంచరీకోసం తన 1000 రోజుల నిరీక్షణకు విరాట్‌ తెర దించాడు. ఈ క్రమంలో టీ20ల్లో భారత ఓపెనర్‌గా కోహ్లిని పంపాలని మాజీలు, క్రికెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

"మాకు ఓపెనింగ్‌ స్థానం కోసం జట్టులో చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా మాకు ఇది ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుందని  భావిస్తున్నాను. మా జట్టు ఆటగాళ్లు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసినా అద్భుతంగా రాణించాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ మెగా ఈవెంట్‌లో మేము బ్యాటింగ్‌ అర్డర్‌లో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో కోహ్లి ఓపెనర్‌గా ఛాన్స్‌ ఉంది.

విరాట్‌ ఓపెనర్‌గా మాకు మంచి ఎంపిక. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కూడా కోహ్లి ప్రారంభిస్తాడు. అతడు ఓపెనర్‌గా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కాబట్టి మా ప్రాణాళికలో కోహ్లి ఓపెనర్‌గా ఉంటాడు. అందుకే ఈ  ఐసీసీ ఈవెంట్‌కు మూడువ ఓపెనర్‌ను కూడా మేము ఎంపిక చేయలేదు "అని రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్‌, తప్పుడే రివ్యూ రాస్తే మరణమే..!

Videos

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)