Breaking News

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ అథ్లెట్ల జాబితాలో విరాట్‌

Published on Sun, 02/04/2024 - 15:49

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి అత్యంత అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ అలిమో ఫిలిప్‌ ఎంపిక చేసిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో విరాట్‌ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితా టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌ విరాట్‌ మాత్రమే. అలిమో ఫిలిప్‌ విరాట్‌ను ఫేస్‌ ఆఫ్‌ ద క్రికెట్‌గా అభివర్ణించాడు.

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ అథ్లెట్ల జాబితాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ తర్వాతి స్థానంలో మరో ఫుట్‌బాల్‌ దిగ్గజం, పోర్చుగల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు.

బాక్సింగ్‌ లెజెండ్‌ మొహమ్మద్‌ ఆలీ మూడో స్థానంలో, బాస్కెట్‌బాల్‌ కింగ్‌ మైఖేల్‌ జోర్డన్‌ నాలుగో ప్లేస్‌లో, ట్రాక్‌ చీతా ఉసేన్‌ బోల్ట్‌ ఆరులో, మరో బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ ఏడో స్థానంలో, బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ ఎనిమిదిలో, టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ తొమ్మిదిలో, బంగారు చేప, స్విమ్మర్‌ మైఖేల్‌ ఫెల్ప్స్‌ పదో స్థానంలో నిలిచారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ టాప్‌ 10 అథ్లెట్ల జాబితాలో సెరెనా విలియమ్స్‌ ఒక్కరే మహిళ కావడం విశేషం.

ఇదిలా ఉంటే, విరాట్‌ కోహ్లి ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్న కారణంగా విరాట్‌ జట్టుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్లో విరాట్‌ తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం వైజాగ్‌లో రెండో టెస్ట్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)