Breaking News

కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది

Published on Fri, 05/19/2023 - 19:24

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి జెర్సీ నెంబర్‌ ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం '18'. నిజానికి 18 నెంబర్‌ జెర్సీ అనేది కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం వేసుకుంటున్నట్లు చాలాసార్లు తెలిపాడు. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం(మే 18న) ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరిశాడు. నాలుగేళ్ల తన ఐపీఎల్‌ సెంచరీ నిరీక్షణకు తెరదించిన కోహ్లి ఆ సెంచరీ అందుకుంది మే 18 కావడంతో మరోసారి అతని జెర్సీ నెంబర్‌ ప్రస్తావనకు వచ్చింది.


Photo: IPL Twitter

మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ జెర్సీ నెంబర్‌-18పై మరోసారి స్పందించాడు. నిజాయితీగా చెప్పలాంటే అండర్‌-19 క్రికెట్‌ ఆడేటప్పుడే నాపేరుతో 18 నెంబర్‌ జెర్సీ ఇచ్చారు.  ఆ క్షణం 18 అనేది నా జీవితంలో ప్రత్యేకంగా మారబోతుందన్నది అప్పటికి తెలియదు. యాృదృశ్చికంగా నేను క్రికెట్‌లో అడుగుపెట్టింది ఆగస్టు 18న.. నా తండ్రి చనిపోయింది డిసెంబర్‌ 18న.. రెండు ముఖ్య సంఘటనలు ఒకే తేదీన జరగడం ఎప్పటికి మరిచిపోను అని చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. కోహ్లి 18 నెంబర్‌ వెంటపడినట్లు అనిపించడం లేదు.. అతని వెనకాలే 18 వస్తున్నట్లు తెలుస్తోంది.


Photo: IPL Twitter

'18' నెంబర్‌తో కోహ్లికున్న అనుబంధం..
► ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో(మే 18, 2023) కోహ్లి సెంచరీ చేసింది '18' వ ఓవర్లోనే. సిక్సర్‌ కొట్టి కోహ్లి సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 
►కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది 2008 ఆగస్టు 18 నాడే.


►చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లి సెంచరీ చేసింది కూడా '18' వ తేదీనే. మార్చి 18, 2012లో ఢాకాలో పాక్‌తో జరిగిన వన్డేలో విరాట్‌ 183 పరుగులు చేశాడు. యాదృశ్చికంగా అతను ఆరోజు చేసిన పరుగుల్లోనూ '18' కనిపించడం విశేషం.
►ఇక కోహ్లి టెస్టుల్లో రెండు శతకాలను ఇదే రోజున బాదాడు. 18 ఆగస్టు 2018లో ఇంగ్లండ్‌పై 103 పరుగులు.. 2013 డిసెంబర్ 18న దక్షిణాఫ్రికాపై 119 పరుగులు చేశాడు.


►ఇక కోహ్లి 17 ఏళ్ల వయసులో అతని తండ్రి ప్రేమ్‌ కోహ్లి 2006 డిసెంబర్‌ '18' వ తేదీన తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో కోహ్లి రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మరణ వార్తను దిగమింగి మ్యాచ్‌ ఆడిన కోహ్లి 90 పరుగులు చేశాడు. మ్యాచ్‌ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. 
►ఇక  కోహ్లి జెర్సీ నెంబర్‌ '18' కి మరో ప్రత్యేకత కూడా ఉంది. కోహ్లి తండ్రి ప్రేమ్‌ కోహ్లి క్రికెట్‌ ఆడే రోజుల్లో 18 నెంబర్‌ జెర్సీనే వేసుకోవడం విశేషం. అందుకే కోహ్లి తన తండ్రి జ్ఞాపకార్థం అదే నెంబర్‌ జెర్సీతో కనిపిస్తున్నాడు.

చదవండి: కోహ్లి ఫిదా..  తెలుగోళ్ల అభిమానమే వేరప్పా!

నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్‌' కోహ్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)