కలిసొచ్చిన ఉప్పల్‌ స్టేడియం.. కోహ్లి మెరిసేనా!

Published on Sun, 09/25/2022 - 08:05

భారత్‌లో విరాట్‌ కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్‌ స్టేడియం ఒకటి. ఈ గ్రౌండ్‌లో కోహ్లి మూడు ఫార్మాట్‌లలో కలిపి 8 మ్యాచ్‌లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌) ఆడాడు. ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 607 పరుగులు స్కోరు చేశాడు. 2019లో చివరిసారి ఈ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 94 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో​ కోహ్లి పెద్దగా రాణించలేదు. తొలి టి20లో 2 పరుగులకే వెనుదిరిగిన కోహ్లి.. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టి20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరోవైపు ఈ మైదానం ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అచ్చిరాలేదు. ఈ గ్రౌండ్‌లో రోహిత్‌ 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 46 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌కు కూడా ఈ గ్రౌండ్‌ కలిసి రాలేదు. 2019 మార్చి 2న భారత్‌తో ఇక్కడ జరిగిన వన్డేలో ఫించ్‌ ‘డకౌట్‌’ అయ్యాడు. ఇక తొలి రెండు టి20ల్లో చెరొక విజయం సాధించిన ఇరుజట్లు హైదరాబాద్‌లో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.

చదవండి: ఇన్నింగ్స్‌ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్‌'లా కనబడింది

Videos

రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం

జిల్లాల పునర్విభజన వెనుక బాబు మాస్టర్ ప్లాన్!

మందు కొట్టి.. పోలీసులను కొట్టి.. నేవీ ఆఫీసర్ రచ్చ రచ్చ

అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?

యూరియాతో పాల తయారీ

ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ప్రమాదం ఎలా జరిగిందంటే

20 పొట్టేళ్ల తలలు దండ చేసి బాలకృష్ణకు వేస్తే నీకు కనిపించలేదా?

అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!

మంత్రి నారాయణ ఆడియో లీక్.. రౌడీషీటర్లకు డిసెంబర్ 31st ఆఫర్

Photos

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)