Breaking News

ఫైన‌ల్లో విజ‌యం.. వెక్కి వెక్కి ఏడ్చిన హార్దిక్ పాండ్యా! వీడియో వైర‌ల్‌

Published on Sun, 06/30/2024 - 09:55

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఛాంపియ‌న్స్‌గా భార‌త్ అవ‌త‌రించింది. శ‌నివారం బార్బోడ‌స్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించిన టీమిండియా.. రెండో సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీని ముద్దాడింది. 

ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ టైటిల్ పోరులో 7 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. ఓట‌మి త‌ప్ప‌ద‌న‌కున్న చోట భార‌త బౌల‌ర్లు అద్బుతం చేసి త‌మ జ‌ట్టును మ‌రోమారు విశ్వవిజేత‌గా నిలిపారు.

177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ప్రోటీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. కోహ్లి(76), అక్షర్ ప‌టేల్(47) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.

క‌న్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా..
ఆఖ‌రి ఓవ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. చివ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను రోహిత్‌.. హార్దిక్ పాండ్యాకు అప్ప‌గించాడు. రోహిత్ న‌మ్మ‌కాన్ని పాండ్యా ఒమ్ము చేయ‌లేదు. కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి భార‌త్‌కు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు.

ఆఖ‌రి బంతి ముగిసిన వెంట‌నే భార‌త ఆట‌గాళ్లు తీవ్ర బావోద్వేగానికి లోన‌య్యారు.  రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు. హార్దిక్ పాండ్యా అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. పాండ్యాను ఓదార్చ‌డం ఎవ‌రి త‌రం కాలేదు. వీరిద్ద‌రితో పాటు విరాట్ కోహ్లి, సిరాజ్ సైతం క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)