Breaking News

మ్యాచ్ మధ్యలో చాక్లెట్‌ తిన్న కోహ్లి! స్లిప్‌లో అది అవసరమా?

Published on Thu, 03/09/2023 - 16:48

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆటలో భారత్‌పై ఆసీస్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా(104 నాటౌట్‌) సెంచరీతో చెలరేగాడు.

ఉస్మాన్‌ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అతడితో పాటు కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కెప్టెన్‌ స్మిత్‌(38), హెడ్‌(32) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్‌ తలా వికెట్‌ సాధించారు.

మ్యాచ్ మధ్యలో చాక్లెట్‌ తిన్న కోహ్లి
తొలి రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చాక్లెట్‌ను తింటూ కెమెరాకి చిక్కాడు. అంతేకాకుండా షమీ బంతిని వేయడానికి సిద్దమయ్యే క్రమంలో సగం తిన్న చాక్లెట్‌ను కోహ్లి.. సెకెండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ పైకి విసిరాడు.

అయ్యర్‌ దానిని తన జేబులో పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా స్లీప్‌లో ఫీల్డింగ్ చేసే ప్లేయర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. అటువంటిది చాక్లెట్‌లు తింటూ కాలక్షేపం చేస్తున్న కోహ్లిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా  ఈ సిరీస్‌లో కోహ్లి అదే స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ దాదాపు నాలుగు సులువైన క్యాచ్‌లను జారవిడిచాడు.
చదవండి: Ind Vs Aus: జడ్డూ దెబ్బకు స్టంప్స్‌ ఎగిరిపోయాయి! అంత ఓవరాక్షన్‌ ఎందుకు స్మిత్‌? వీడియో వైరల్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు