చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Published on Fri, 12/26/2025 - 21:07

విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్‌, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.  లిస్ట్-ఏ క్రికెట్‌లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్‌-ఎ కెరీర్‌లో 57.86 సగటుతో     15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.

లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే
1. విరాట్ కోహ్లి (భారత్‌): 57.87- 16,207 పరుగులు
2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు
3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు
4. ఛతేశ్వర్ పుజారా (భారత్‌): 57.01-5759 పరుగులు
5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్‌): 56.68- 4648 పరుగులు

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(70) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌ బౌలర్లలో విశాల్‌ జైశ్వాల్‌ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు సాధించాడు. 

అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్‌ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్‌ బ్యాటర్లలో ఆర్య దేశాయ్‌(57) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సౌరవ్‌ చౌహన్‌(49), ఉర్విల్‌ పటేల్‌(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్‌ మూడు, ఇషాంత్‌ శర్మ, అర్పిత్‌ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్‌ సెంచరీతో సత్తాచాటిన విరాట్‌ కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)