Breaking News

Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్‌! దారుణ వైఫల్యం

Published on Fri, 01/31/2025 - 11:35

‘కింగ్‌’ రాకతో రంజీ(Ranji Match)లకు కూడా కళొచ్చింది. పుష్కర కాలం తర్వాత రికార్డుల రారాజు రంజీ బరిలో దిగగానే అభిమానం కట్టలు తెంచుకుని స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతుందా అన్న స్థాయిలో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు ఇరవై ఏడు వేల మంది తరలివచ్చారు. సూపర్‌స్టార్‌ బ్యాటింగ్‌ చేస్తే చూడాలని ఆశగా రెండో రోజు వరకు వేచి చూశారు.

కానీ వారి ఆశలపై ‘రన్‌మెషీన్’ నీళ్లు చల్లాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. తన వైఫల్యాల పరపరంపర కొనసాగిస్తూ భారంగా నిష్క్రమించాడు. దీంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది. తమ అభిమాన ఆటగాడు మైదానం వీడుతుంటే అంతా నిరాశగా అతడి వైపు చూస్తూ ఉండిపోయారు.

ఆసీస్‌ గడ్డపై విఫలం
గత కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి(Virat Kohli).. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో శతకం బాది టచ్‌లోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు.

ముఖ్యంగా ఆఫ్‌ స్టంప్‌ దిశగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ప్రతిసారీ ఆసీస్‌ బౌలర్ల చేతికి ఇచ్చి వికెట్‌ సమర్పించుకున్నాడు కోహ్లి. ఈ క్రమంలో ‘కింగ్‌’ పనైపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దేశవాళీ క్రికెట్‌ బరిలోకి దిగి మునుపటి లయను అందుకోవాలనే సూచనలు వచ్చాయి.

తొలిరోజు ఫీల్డింగ్‌కే పరిమితమైన కోహ్లి
ఈ క్రమంలో సొంతజట్టు ఢిల్లీ తరఫున రైల్వేస్‌తో మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లి రంజీల్లో పునరాగమనం చేశాడు. సొంత మైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. వాళ్లంతా వచ్చింది కేవలం కోహ్లిని చూడటానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

అయితే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. తొలిరోజు కోహ్లి ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు.  తనదైన శైలిలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ సందడి చేశాడు. ఇక ఆయుశ్‌ బదోని సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. రైల్వేస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం గురువారమే బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 41 పరుగులు చేసింది.

ఒకే ఒక్క ఫోర్‌
ఈ క్రమంలో రెండో రోజైన శుక్రవారం ఆట సందర్భంగా కోహ్లి క్రీజులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు పదిహేను బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్‌ సాయంతో ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రైల్వేస్‌ పేసర్‌ హిమాన్షు సంగ్వాన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి.. క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 

బౌలర్‌ దెబ్బకు కోహ్లి ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయింది. దీంతో రైల్వేస్‌ జట్టు సంబరాలు అంబరాన్నంటగా.. ప్రేక్షకులంతా ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు. ఇక కోహ్లి రంజీ రీఎంట్రీలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్‌ బాట పట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఇదిలా ఉంటే.. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది.

చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్‌.. రంజీల్లో ఆల్‌టైమ్‌ రికార్డు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)